అర్థరాత్రి విశాఖ గంగవరం పోర్ట్‌లోకి సైలంట్‌గా ఏంట్రీ.. అది చూసి కార్మికుల పరుగో పరుగు..!

| Edited By: Balaraju Goud

Aug 25, 2024 | 1:40 PM

దలలేని స్థితిలో భారీ కొండచిలువ కనిపించింది. ఎందుకంటే అప్పటికే పొట్ట నిండా ఏదో ఆహారం తిని తిష్ట వేసింది. కార్మికుల అలికిడి విని మెల్లగా పాకేందుకు ప్రయత్నిస్తోంది. దాన్ని తరిమే సాహసం చేయలేని కార్మికులు.. పాములు పట్టే నేర్పరి కిరణ్ కు సమాచారం అందించారు.

విశాఖ గంగవరం పోర్ట్.. కార్మికులంతా పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. పొద్దుపొయింది. కాస్త చీకటి పడింది. అంతలో ఓ కార్మికుడు గట్టిగా అరిశాడు. కేకలు పెడుతూ పరుగులు తీశాడు. అందరిలో ఆందోళన మొదలైంది. ఏమని అడిగితే భారీ కొండచిలువ అక్కడ ఉన్నట్టు చెప్పాడు. వెళ్లి చూస్తే.. కదలలేని స్థితిలో భారీ కొండచిలువ కనిపించింది. ఎందుకంటే అప్పటికే పొట్ట నిండా ఏదో ఆహారం తిని తిష్ట వేసింది. కార్మికుల అలికిడి విని మెల్లగా పాకేందుకు ప్రయత్నిస్తోంది. దాన్ని తరిమే సాహసం చేయలేని కార్మికులు.. పాములు పట్టే నేర్పరి కిరణ్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కిరణ్.. పామును పట్టుకొని ప్రయత్నం చేశాడు. ఎదురు తిరుగుతున్నప్పటికీ ఆ పామును అత్యంత చాకచక్యంగా బంధించాడు కిరణ్. అనంతరం నిర్జన ప్రదేశంలో వదిలివేశాడు. దీంతో కార్మికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..