
విశాఖలో మరో ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. పప్పుల చిట్టీల పేరుతో టోకరా వేశాడు మణికుమార్. కమిషన్ల పేరుతో మాయమాటలు చెప్పి కస్టమర్లకు ఎరవేశాడు. వారిని ఆకట్టుకొని లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. అయితే ఇటీవల సరుకులివ్వడం మానేశాడు మణికుమార్. దీంతో తాము చెల్లించిన డబ్బులు తిరిగివ్వాలంటూ ఒత్తిడి చేశారు బాధితులు. శనివారం అందరికీ సరుకులతో పాటు మనీ ఇచ్చేస్తానని చెప్పి ముఖం చాటేశాడు. దీంతో తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు..తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.
9 స్టార్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో 10ఏళ్ల క్రితం ..రైస్, ఆయిల్ హోల్‌సేల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు మణికుమార్. క్రమంగా వినియోగదారులు పెరగడంతో చిట్టీలు ప్రారంభించాడు. నెలకు 5వందలు చెల్లిస్తే చాలు.. ఏడాదికి 8వేల విలువైన సరుకులందించేవాడు.
దసరా, సంక్రాంతి పండుగల పేరుతో పప్పుల చిట్టీలుగా పేరు పెట్టి చైన్ పథకం అమలుచేశాడు. ఇందులో మరికొందరిని చేర్పిస్తే స్పెషల్ డిస్కౌంట్స్, కమిషన్స్ ఇచ్చేవాడు. దీంతో కూలీలు, ఆటోడ్రైవర్లు, కార్మికులు, మహిళలు ఇలా వందలాదిమంది సభ్యులుగా చేరారు. లక్షలు వసూలు చేసి పరారవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం