Fire Accident: విజయవాడ భారీ అగ్ని ప్రమాదం.. కర్నూరం తయారి కంపెనీలో ఒక్కసారిగా చెలరేగిన అగ్ని కీలలు

|

Oct 21, 2022 | 3:14 PM

కర్పూరం తయారు చేసే కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు దాటికి ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో..

Fire Accident: విజయవాడ భారీ అగ్ని ప్రమాదం.. కర్నూరం తయారి కంపెనీలో ఒక్కసారిగా చెలరేగిన అగ్ని కీలలు
Vijayawada Fire Accident
Follow us on

విజయవాడ వన్ టౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కర్పూరం తయారు చేసే కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు దాటికి ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో జనం పరుగులు పెట్టారు. ఈ ఉదయం కర్పూరం మిక్స్ చేసేందుకు ఉపయోగించే గ్రాండర్‌ ఆన్ చేస్తుండగా ఈ ఘటన చోటుసుకుంది. పవర్ స్విచ్ బటన్ వేడయంతోనే షార్ట్ షర్క్యట్ కారణంగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున్న వ్యాపించడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

అగ్నిప్రమాదంకు సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది. కర్పూరం తయారు చేసే ఎస్పీఏజే ప్రాజెక్ట్స్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటన జరిగినపుడు పనుల్లో ఉన్న 8 మంది సిబ్బంది ఉన్నారు. మంటలు వ్యాపిస్తుండటంతో సిబ్బంది పరుగులు పెట్టారు. అందరూ సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం