విశాఖపట్నం న్యూస్, ఆగస్టు 26: తెల్లవారితే శ్రావణ శుక్రవారం.. వరలక్ష్మీ దేవి పూజ చేసుకునేందుకు ఆ కుటంబం అన్ని ఏర్పాాట్లు సిద్దం చేసుకున్నారు. కానీ అంతలోనే తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్యభర్తలు మృతి చెందారు. ప్రస్తుతం కుమార్తె పరిస్థితి విషయంగా అప్పుల వల్ల కుటుంబ ఆత్మహత్యకు యత్నించడం, కుటుంబంలో ఇద్దరు మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలోని పెందుర్తి మండలం గొరపల్లి అనే గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అయితే స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నారు. గొరపల్లి గ్రామంలోని కల్లూరి సత్తిబాబు (57) కిరాణ దుకాణం నిర్వహిస్తుండేవారు. ఈయన భార్య సూర్యకుమారి (48), కుతురు నీలిమ(24), కొడుకు సంతోష్ కుమార్ ఉన్నారు.
సంతోష్ నగరంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నారు. నీలిమ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే సత్తిబాబు కుటుంబ అవసరాలు, తన వ్యాపారాల కోసం డబ్బు కావాల్సి వచ్చింది. ఇందుకోసం కొన్నిచోట్ల అప్పులు చేశారు. కానీ ఆ అప్పులు ఎక్కు కావడం వల్ల వాటిని తీర్చలేకపోయారు. ఈ క్రమంలోనే అప్పులు ఇచ్చినవారు సత్తిబాబుపై ఒత్తిడి చేశారు. దీంతో గురువారం రాత్రి 11 గంటల దాటిన తర్వాత సత్తిబాబు, అతని భార్య సూర్యకుమారి, కూతురు నీలిమ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సూర్యకుమారి గ్రామంలో ఉంటున్న వారి బంధువులకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు గ్రామస్థులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సత్తిబాబు, అతని భార్య సూర్యకుమారి, కూతురు నీలిమను ఆసుపత్రికి తరలించారు.
అయితే వారు చికిత్స పొందుతుండగానే శుక్రవారం ఉదయం పూడ సత్తిబాబు మృతి చెందారు. ఆ తర్వాత మధ్యాహ్నం భార్య సూర్యకుమారి మరణించింది. ప్రస్తుతం కూతురు నీలిమ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ కుటుంబ సభ్యులు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సమయంలో కొడుకు సంతోష్ కుమార్ ఇంటి దగ్గర లేరు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో భార్యభర్తలు మృతిచెందడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా చాలామంది అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇలా తమకు వచ్చే సమస్యలను ఎదుర్కోలేక మనస్థాపానికి గురై ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళనగా మారుతోంది. ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలంటూ నిపుణలు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..