మత్స్యకారుల వలకు చిక్కిన విమానం.. సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత అసలు కథ తెలిసి..

|

Feb 02, 2023 | 12:33 PM

విమానాన్ని పోలిన ఆ డ్రోన్‌ను పరిశీలిస్తున్నారు కోస్ట్‌గార్డ్‌ అధికారులు. వేరే దేశం నుంచి వచ్చి ఉంటుందా..దీన్ని ఎవరు ప్రయోగించారు అన్న కోణంలోనూ విచారించారు. అయితే ఈ డ్రోన్‌ భారత్‌కు..

మత్స్యకారుల వలకు చిక్కిన విమానం.. సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత అసలు కథ తెలిసి..
Banshee Target Drone
Follow us on

శ్రీకాకుళం జిల్లా భావనపాడు దగ్గర సముద్రంలో విమానం ఆకారంలో ఉన్న ఓ డ్రోన్‌ కలకలం సృష్టించింది. మత్స్యకారుల వలలో పడింది ఈ మానవరహిత డ్రోన్‌. దానిపై టార్గెట్ బన్షీ అంటూ స్టిక్కర్లు ఉండటంతో.. మెరైన్ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానిక అధికారులు. దీంతో విమానాన్ని పోలిన ఆ డ్రోన్‌ను పరిశీలిస్తున్నారు కోస్ట్‌గార్డ్‌ అధికారులు. వేరే దేశం నుంచి వచ్చి ఉంటుందా..దీన్ని ఎవరు ప్రయోగించారు అన్న కోణంలోనూ విచారించారు. అయితే ఈ డ్రోన్‌ భారత్‌కు చెందినదేనని.. ఆందోళన అవసరం లేదంటున్నారు పోలీసులు. ఆర్మీ లేదా నేవీకి చెందినది అయ్యిండొచ్చని.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు.

111కేజీల బరువున్న ఈ డ్రోన్‌ను.. జనవరి 28న ప్రయోగించినట్టు తెలుస్తోంది. నిఘా కోసం ప్రయోగించినప్పుడు..ఫెయిలై సముద్రంలో పడి ఉండొచ్చని భావిస్తున్నట్టు తెలిపారు పోలీసులు.

టార్గెట్ బన్షీ ఎవరికి చెందినదంటే..!

గతంలో టార్గెట్ టెక్నాలజీ బన్షీ & మెగ్గిట్ బాన్షీ 1980లలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ శిక్షణ కోసం అభివృద్ధి చేసిన బ్రిటిష్ టార్గెట్ డ్రోన్. ఈ మానవ రహిత విమానాన్ని బన్షీని టార్గెట్ టెక్నాలజీ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. కంపెనీ డ్రోన్‌ల కోసం తేలికపాటి ఇంజిన్‌లలో ప్రత్యేకతను కలిగి ఉంది. 1983లో దాని స్వంత డిజైన్‌ను అభివృద్ధి చేసింది. బన్షీ అనేది టెయిల్‌లెస్ డెల్టా వింగ్ ప్లాన్‌ఫారమ్‌తో ఎక్కువగా కాంపోజిట్ మెటీరియల్ (కెవ్లర్, గ్లాస్-రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్)తో నిర్మించబడింది. మొదటి మోడల్‌లు 26 hp 342 cc నార్మలైర్-గారెట్ టూ-సిలిండర్ టూ-స్ట్రోక్ డ్రైవింగ్‌ను పుషర్ ప్రొపెల్లర్‌ని ఉపయోగించాయి. 1-3 గంటల వరకు ఓర్పుతో 35-185 kt పనితీరు ఉంది. విమాన నియంత్రణ రెండు ఎలివోన్‌ల ద్వారా ఉంటుంది. 185 కి.టి. తరువాతి నమూనాలు నార్టన్ P73 రోటరీ ఇంజిన్‌లను ఉపయోగించాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం