Siddam Sabha: రాప్తాడు సిద్ధం సభ వేదికగా మేనిఫెస్టో ప్రకటించబోతున్న సీఎం జగన్.. హామీలు, వరాలపై ఉత్కంఠ!

| Edited By: Balaraju Goud

Feb 15, 2024 | 3:46 PM

భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఫిబ్రవరి 18న రాప్తాడు వేదికగా మరో సభకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన సీఎం జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే భీమిలి, ఏలూరు సిద్ధం సభలు సక్సెస్ అవ్వడంతో జోష్ మీద ఉన్న వైసీపీ శ్రేణులు, రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Siddam Sabha: రాప్తాడు సిద్ధం సభ వేదికగా మేనిఫెస్టో ప్రకటించబోతున్న సీఎం జగన్.. హామీలు, వరాలపై ఉత్కంఠ!
Raptadu Siddam Sabha
Follow us on

భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఫిబ్రవరి 18న రాప్తాడు వేదికగా మరో సభకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన సీఎం జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే భీమిలి, ఏలూరు సిద్ధం సభలు సక్సెస్ అవ్వడంతో జోష్ మీద ఉన్న వైసీపీ శ్రేణులు, రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి పది లక్షల మంది సిద్ధం సభకు హాజరవుతారని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు.

రాప్తాడు సిద్ధం సభ వైసీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పుకోవాలి..! ఎందుకంటే రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు, వరాలు ఇవ్వబోతున్నారన్నదీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాప్తాడు సిద్ధం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

భీమిలి, దెందులూరు సిద్ధం సభలు సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ మీద ఉంది వైసీపీ. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల సిద్ధం సభల కంటే దీటుగా రాయలసీమలో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాయలసీమ నాలుగు జిల్లాల వ్యాప్తంగా మొత్తం 49 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు, కార్యకర్తలు రాప్తాడులో జరగబోయే సిద్ధం సభకు హాజరవుతారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. దాదాపు పది లక్షల మంది రాప్తాడు సిద్ధం సభకు హాజరవుతారని నాయకులు అంచనా వేస్తున్నారు.

రాప్తాడు నియోజకవర్గంలోని 100 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా వేదికపై 300 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తల కోసం 100 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఏం చెప్పబోతున్నారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది… ఎందుకంటే రాప్తాడు సిద్ధం సభలో ఎన్నికల శంఖారావంలో భాగంగా సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు.

ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు. ప్రజలకు ఎలాంటి వరాలు ప్రకటించబోతున్నారు. అనేదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. 2024 లో అధికారులకు వచ్చిన తర్వాత అమలు చేయబోయే హామీల ప్రకటనపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 18న సిద్ధం సభలో వరాలు, హామీలను ప్రకటించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని, రాబోయే ఎన్నికల్లో ఆ హామీలను కొనసాగిస్తూ ఇంకా ఎలాంటి హామీలు ఇవ్వాలనే దానిపై సీఎం జగన్ దృష్టి పెట్టారట.. ప్రధానంగా సీఎం జగన్ రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ఇదిలావుంటే, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా సీఎం జగన్ హామీల ప్రకటన ఉంటుందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. రైతు రుణమాఫీ, మహిళలు స్వయం శక్తితో ఎదిగేలా కొత్త పథకం, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని వారికి కూడా హామీ ప్రకటన దిశగా నిర్ణయం ఉండబోతుందని వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అనంతపురం సిద్ధం సభా వేదికగా సీఎం జగన్ ప్రకటించబోయే ఎన్నికల హామీలు, వరాలపై ఉత్కంఠ…. అందరిలో ఆసక్తి నెలకొంది….

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…