Andhra Pradesh: మద్యం మత్తులో బస్సు డ్రైవర్ హల్ చల్.. నడిరోడ్డుపై అడ్డంగా బస్సు ఆపేసి.. ఏం చేశాడో తెలుసా..

|

Nov 17, 2022 | 9:38 AM

విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన ఆ డ్రైవర్ పూటుగా మద్యం తాగాడు. అంతటితో ఆగకుండా బస్సు స్టార్ట్ చేశాడు. అడ్డదిడ్డంగా నడుపుతూ రోడ్డు పై వెళ్తున్న వారినే కాకుండా, బస్సులో కూర్చున్న స్టూడెంట్స్...

Andhra Pradesh: మద్యం మత్తులో బస్సు డ్రైవర్ హల్ చల్.. నడిరోడ్డుపై అడ్డంగా బస్సు ఆపేసి.. ఏం చేశాడో తెలుసా..
Drunk And Drive
Follow us on

విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన ఆ డ్రైవర్ పూటుగా మద్యం తాగాడు. అంతటితో ఆగకుండా బస్సు స్టార్ట్ చేశాడు. అడ్డదిడ్డంగా నడుపుతూ రోడ్డు పై వెళ్తున్న వారినే కాకుండా, బస్సులో కూర్చున్న స్టూడెంట్స్ కు చుక్కలు చూపించాడు. విద్యార్థులు భయంతో కేకలు వేయడంతో బస్సును రోడ్డుపైనే అడ్డంగా నిలిపివేశాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపై పడుకున్నాడు. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు కాలేజ్ మెనేజ్ మెంట్ కు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి వచ్చారు. అయితే.. అప్పటికే విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో వారిని అడ్డుకున్నారు. అంతే కాకుండా వారు మీడియాతో మాట్లాడకుండా నివారించారు.  ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు కాలేజ్ బస్సులో పయనమయ్యారు. బాలయ్య అనే వ్యక్తికి బస్సు డ్రైవర్ గా బాధ్యతలు అప్పగించారు. బస్ స్టార్ట్ చేసిన బాలయ్య..మద్యం తాగి ఉండటంతో వెహికిల్ పై కంట్రోల్ కోల్పోయాడు. దీంతో నడిరోడ్డుపై బస్సును నిలిపివేశాడు.

పామర్రు మండలం కనుమూరు వద్దకు వచ్చేసరికి మద్యం మత్తు ఎక్కువైన డ్రైవర్.. మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై కళాశాల బస్సును అడ్డదిడ్డంగా పోనీయడంతో విద్యార్థులు భయందోళనకు గురయ్యారు. భయంతో కేకలు వేయడంతో బాలయ్య బస్సును నిలిపివేసి రోడ్డుపై పడుకున్నాడు. ఆందోళన చెందిన విద్యార్థులు బస్సు దిగి కాలేజ్ మేనేజ్ మెంట్ కు సమాచారం అందించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు.. డ్రైవర్ పరిస్థితిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హడావిడిగా బస్సు వద్దకు వచ్చిన కళాశాల ప్రతినిధులు, జరుగుతున్న తతంగాన్ని వీడియో చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థులు మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్నారు.

కార్పొరేట్ కళాశాల అయ్యి ఉండి బాధ్యత లేని వ్యక్తి చేతిలో పిల్లల ప్రాణాలు పెట్టడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు. జరగకూడనిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత తతంగం జరిగినా కళాశాల ప్రతినిధులు మాత్రం తమది తప్పేమీ లేదన్నట్లుగా మాట్లాడడం తల్లిదండ్రులను, స్థానికులను విస్మయానికి గురిచేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..