Tirupati: తిరుపతిలో విషాదం.. రోజూలాగే బాత్రూంలోకి వెళ్లిన బాలుడు.. ఆ తర్వాత

ఇటీవల ఏదైన చిన్న సమస్యలు వచ్చినా వాటిని భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పడు తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఓ 14 ఏళ్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

Tirupati: తిరుపతిలో విషాదం.. రోజూలాగే బాత్రూంలోకి వెళ్లిన బాలుడు.. ఆ తర్వాత
Death

Edited By: Ravi Kiran

Updated on: Apr 25, 2023 | 3:50 PM

ఇటీవల ఏదైన చిన్న సమస్యలు వచ్చినా వాటిని భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పడు తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఓ 14 ఏళ్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కొండమిట్టకు చెందిన మోహన్, సుజాత దంపతులకు కొడుకు సోము ఉన్నాడు. ఈ బాలుడు శ్రీకాళహస్తి వివేకనంద పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రోజూ ఎప్పట్లాగే ఇంట్లోని బాత్‌రూంలోకి వెళ్లిన సోము అందులోనే ఉరి వేసుకొని బలవన్మరణం చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరో విషయం ఏంటంటే 20 రోజుల క్రితం అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మరో బాలుడు ఇదే తరహాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు వారి ఇంట్లోని బాత్‌రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో దుమారం రేపుతోంది. పాఠశాలలో ఒత్తిడి వల్లే ఆ ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటంబ సభ్యులు, బంధు మిత్రులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి