Vijayawada: హీటర్ పెట్టి బాత్రూంకు వెళ్లిన తల్లి.. పక్కన మంచంపై ఆడుకుంటున్న పాపాయి..

|

Mar 30, 2023 | 6:50 PM

ఆ పాపాయి ఎంత బాధను అనుభవించిందో.. ఇప్పుడు ఆ తల్లి ఎంత గుండెలు పగిలేలా రోధిస్తుందో..? అందుకే చిన్నారులు ఇంట్లో ఉంటే అత్యంత అప్రమత్తత అవసరం...

Vijayawada: హీటర్ పెట్టి బాత్రూంకు వెళ్లిన తల్లి.. పక్కన మంచంపై ఆడుకుంటున్న పాపాయి..
Water Heater
Follow us on

నెలల పసిపిల్లలకు ఏం తెలుస్తుంది చెప్పండి. అందుకే తల్లిదండ్రులు వారిని కంటికి రెప్పలా వారిని కాపాడుకోవాలి. చిన్న నిర్లక్ష్యానికి కూడా తప్పదు భారీ మూల్యం. తాజాగా విజయవాడలో ఓ విషాద ఘటన వెలుగుచూసింది. వేడి నీటి బకెట్ లో పడి 8 నెలల చిన్నారి ప్రాణాలు విడిచింది. పాపకు స్నానం చేయించేందుకు బకెట్‌లో నీళ్లు పట్టి.. ఎలక్ట్రిక్ హీటర్ పెట్టి.. బాత్రూంకు వెళ్లింది తల్లి.  చిన్నారి ఉన్న మంచం పక్కనే..  బకెట్ ఉండటంతో ఆడుకుంటూ వెళ్లి బకెట్‌లో పడింది పాపాయి.

ఆ నీళ్ల వేడికి ఆ పసి శరీరం తల్లిడిల్లిపోయింది. చిన్నారి.. బిగ్గరగా ఏడ్చింది. దీంతో పరిగెత్తుకుంటూ వచ్చిన తల్లి.. పాపాయిని బయటకు తీసింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఒళ్లంతా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ.. ఊపిరి విడిచింది ఆ పసి తల్లి. చిన్న నిర్లక్ష్యం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. అందుకే పసివాళ్లు విషయంలో నూటికి వెయ్యి శాతం కేర్ తీసుకోవాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం