Vijayawada: ప్రపంచ వ్యాప్తంగా విగ్‌లకు పెరుగుతోన్న డిమాండ్‌తో మానవ జుట్టు ప్రాసెసింగ్ పరిశ్రమ (హ్యుమన్ హెయిర్ ప్రాసెసింగ్) పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు మారింది. ఇదిలా ఉంటే భవిష్యత్తులో ఈ రంగంలో భారీగా ఉద్యోగాలు రానున్నాయని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు.
తాజాగా ఏలూరులో ఆల్ ఇండియా హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోటగిరి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హ్యుమన్ హెయిర్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలపై చర్చించారు. వెంట్రుకల అక్రమ రవాణాను అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో జుట్టు, జుట్టు ఉత్పత్తుల పరిశ్రమ ద్వారా ఏకంగా రూ. 30 నుంచి రూ. 40 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆర్జించవచ్చని తెలిపారు.
ఈ రంగం అభివృద్ధిలో తమ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా మానవ వెంట్రుకలు, జుట్టు ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన బంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసిందని తెలిపారు. దీని కారణంగా అక్రమ రవాణాకు కొంత అడ్డుకట్ట వేయగలిగామని ఎంపీ చెప్పుకొచ్చారు.
Guntur: దొంగతనానికి వచ్చి దర్జాగా బెడ్ పై నిద్రపోయాడు.. తెల్లారగానే ఏం జరిగిందో తెలుసా?