కారు బోనెట్‌లో భారీ విషసర్పం..
తిరుమలలో భారీ విషసర్పం హల్‌చల్ చేసింది. ఆగివున్న కారులోకి పాము దూరడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరలోవున్న పీఏసీ 4 వద్ద ఈ ఘటన జరిగింది. పక్కనే ఉన్న పొదళ్లలోంచి రోడ్డుపైకి వచ్చిన పాము ఒక్కసారిగా కారులోకి చొరబడింది. స్నేక్‌ను చూసిన భక్తులు వెంటనే పరుగులు పెట్టారు. భయంతో కారును అక్కడనే వదిలేసి వెళ్లారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ అతికష్టం మీద ఇంజిన్‌లో దూరిన పామును బయటికి తీసి అడవుల్లో […]

తిరుమలలో భారీ విషసర్పం హల్‌చల్ చేసింది. ఆగివున్న కారులోకి పాము దూరడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరలోవున్న పీఏసీ 4 వద్ద ఈ ఘటన జరిగింది.
పక్కనే ఉన్న పొదళ్లలోంచి రోడ్డుపైకి వచ్చిన పాము ఒక్కసారిగా కారులోకి చొరబడింది. స్నేక్‌ను చూసిన భక్తులు వెంటనే పరుగులు పెట్టారు. భయంతో కారును అక్కడనే వదిలేసి వెళ్లారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ అతికష్టం మీద ఇంజిన్‌లో దూరిన పామును బయటికి తీసి అడవుల్లో వదిలేశారు.
ఈ పాము సుమారు 8 అడుగులు ఉన్నట్లు స్నేక్ క్యాచర్ భాస్కర్ తెలుపుతున్నారు. నాగుపాము చాలా విషపూరితమైందని చెప్తున్నారు. పామును పట్టుకోవడంతో ఎవరికి ఎలాంటి హాని జరగలేదన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.



