AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కాటికి కాళ్లుచాపిన వయస్సులో ఇదేం పోయేకాలం.! ఈ వృద్దుడు ఏం చేశాడో తెలిస్తే

కామాతురాణాం.. నభయం.. నలజ్జ.. అన్న పదాలకు ఈ వృద్దుడి ఉదంతం సరిగ్గా సరిపోతుంది. మనవరాలి వయస్సున్న బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడి పలుమార్లు లైంగిక దాడి చేసి బాలికను గర్భవతిని చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Andhra: కాటికి కాళ్లుచాపిన వయస్సులో ఇదేం పోయేకాలం.! ఈ వృద్దుడు ఏం చేశాడో తెలిస్తే
Representative Image
Fairoz Baig
| Edited By: |

Updated on: May 26, 2025 | 9:19 PM

Share

ఉమ్మడి ప్రకాశంజిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి తిరుమల శెట్టి వెంకటేశ్వర్లు అనే 65 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి శైలజ సోమవారం తీర్పుని వెల్లడించారు. అంతేకాకుండా ఈ కేసులో బాధితురాలికి ప్రభుత్వం తరుపున 6 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ముద్దాయికి శిక్ష పడేటట్లు చేసిన ప్రాసిక్యూషన్ ను బాపట్లజిల్లా ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేకంగా అభినందించారు.

మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, పోలీసులు హెచ్చిరిస్తూనే ఉన్నా అక్కడక్కడ కామాంధులు బరితెగిస్తూనే ఉన్నారు… 2023 సంవత్సరంలో ఉమ్మడి ప్రకాశంజిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక పై అదే వీధిలో ఉంటున్న 65 ఏళ్ళ వృద్దుడు తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు… వేటపాలెం మండలంలోని ఓగ్రామంలో తల్లితండ్రులతో పాటు నివాసం ఉంటున్న 9 వతరగతి చదువుతున్న 13 సంవత్సరాల బాలికను ఇంటి సమీపంలో వుండే 65 సంవత్సరాల వయస్సు కలిగిన ముద్దాయి తిరుమలశెట్టి వెంకటేశ్వర్లు మాయ మాటలతో లోబరుచుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈక్రమంలో బాలిక పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించాడు… పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది.

బాలిక కడుపునొప్పితో బాధపడుతుండడంతో ఆమె తల్లి ఆసుపత్రిలో చూపించగా ఆమె గర్భవతి అని తెలిసింది. జీజీహెచ్ గుంటూరు ఆసుపత్రికి తరలించి వైద్యులకు చూపించగా వైద్యులు బాలిక గర్భవతి అని నిర్ధారించారు . దీంతో బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు . ఇక ఈ కేసుకు సంబందించిన పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించి కోర్టుకు సమర్పించడంతో 2023లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయి తిరుమల శెట్టి వెంకటేశ్వర్లు( 65 )కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 10 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి శైలజ సోమవారం తీర్పుని వెల్లడించారు… ఈ కేసులో బాధితురాలికి ప్రభుత్వం తరుపున 6 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ముద్దాయికి శిక్ష పడేటట్లు చేసిన ప్రాసిక్యూషన్ ను జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేకంగా అభినందించారు.