Vishakha Rains: ఏపీలో కురుస్తున్న అకాల వర్షంతో ప్రజలకు వేసవి నుంచి ఉపశమనం లభించింది. మరోవైపు పిడుగులతో భారీ సంఖ్యలో మూగజీవాలు మృతి చెందాయి. ఈ తీవ్ర విషాద ఘటన విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే..
అరకులోయ మండలం మాదల పంచాయతీ మెదర్ సొల చిట్టంగొంది బాక్సైట్ అటవీ ప్రాంతంలో బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ పిడుగు పడింది.ఈ పిడుగుపాటుకు 13 ఆవులు 6 మేకలు మృత్యువాత పడ్డాయి.పశువులు కాయడానికి వెళ్ళిన గెమ్మెలి.భీమన్న అనే గిరిజనుడు తోపాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.దీనితో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం అరుకు ఏరియా ఆస్పత్రికి డోలిమోత సహాయంతో బంధువులు తీసుకుని వెళ్ళారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కె.రామరావు గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్నలు డిమాండ్ చేశారు.
మరోవైపు డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ సిలంగొంది అటవీ ప్రాంతంలో పిడుగుపడింది. ఈ దుర్ఘటనలో 12 దుక్కిటెద్దులు మృతి చెందాయి.ఒకేసారి గిరిజన కుటుంబాల్లో ఇంత భారీ నష్టం జరగడంతో గిరిజనులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ భారీ నష్టం నుంచి తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
Also Read: టీచర్ మీద కోపంతో గత 69 ఏళ్లపాటు పెంచిన గోర్లను కట్ చేయించుకున్న శ్రీధర్ చిల్లాల్