Atchutapuram Gas Leak: అచ్యుతాపురంలో విషవాయువు లీక్‌ ఘటన.. బాధితులకు కొనసాగుతున్న చికిత్స..

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని పొరస్ కంపెనీలో గ్యాస్ లీకైన ఘటన.. కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో కార్మికులు పరుగులు పెట్టారు.

Atchutapuram Gas Leak: అచ్యుతాపురంలో విషవాయువు లీక్‌ ఘటన.. బాధితులకు కొనసాగుతున్న చికిత్స..
Atchutapuram Gas Leak

Updated on: Jun 04, 2022 | 8:54 AM

Atchutapuram Gas Leak: అచ్యుతాపురం బ్రాండిక్స్ గ్యాస్‌ లీకేజ్‌ ఘటన ఎల్జీ పాలిమర్స్ ఘటనను తలపించింది. ఎక్కడికక్కడ మహిళలు స్పృహ కోల్పోయి నిల్చున్నచోటే పడిపోతుండడం ఆందోళన కలిగించింది. మొదట నలుగురు అనుకున్నా.. ఆ తర్వాత దాదాపు 400 మంది వరకు బాధితులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని పొరస్ కంపెనీలో గ్యాస్ లీకైన ఘటన.. కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో కార్మికులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో వందలాది మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతపురం ఎస్ఈ జడ్ విషవాయువు లీక్ ఘటనలో.. బాధితులు క్రమంగా కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని.. కొందరు ఆక్సిజన్ పై చికిత్స పొండుతున్నట్లు తెలిపారు. కాగా.. బాధితులకు నిరంతరాయంగా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో 114, మరో రెండు ప్రయివేట్ ఆసుపత్రుల్లో 60మందికి చికిత్స అందిస్తున్నారు. దీంతోపాటు కేజీహెచ్ లో మరో 8మంది బాధితులు చేరారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

  • వివిధ ఆసుపత్రుల్లో చేరిన బాధితులు సంఖ్య – 247
  • డిశ్చార్జ్ అయిన బాధితులు 15మంది
  • ఇంకా చికిత్స పొండుతున్న వారు 232 మంది ఉన్నారు.

కాగా.. పరిస్థితి ఆందోళన కారంగా మారిన వారికి ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రతీ వార్డుకో స్పెషలిస్ట్ తో పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆసుపత్రుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. పోరస్ లాబొరేటరీస్ లీకేజీ ఘటనపై విచారణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, ఏఎస్పీ, పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్, అగ్నిమాపక జిల్లా అధికారితో కమిటీ నియమించింది. దీనిపై ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక అందించాలని ఆదేశించింది. కాగా.. నిపుణుల కమిటీ.. కచ్చితంగా విషవాయువు ఎక్కడ నుంచి లీకైందనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇదిలాఉంటే.. పరిస్థితిపై మంత్రులు బూడి ముత్యాలానాయుడు, అమర్ నాధ్ ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us