Avanigadda: 2 సంవత్సరాల క్రితం కంద మొక్కను నాటిన రైతు.. తాజాగా దుంప కోసం తవ్వగా

ఇంటి పెరట్లో కంద మొక్కను నాటారు. అది కుళాయికి అతి సమీపంలో. గత ఈ ఏడాది తవ్వలేదు. ఇప్పుడు అందుకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే...

Avanigadda: 2 సంవత్సరాల క్రితం కంద మొక్కను నాటిన రైతు.. తాజాగా దుంప కోసం తవ్వగా
Elephant Yam
Follow us

|

Updated on: Feb 02, 2023 | 8:45 PM

ప్రజంట్ సొసైటీలో అంతా కల్తీ మయం. అరె కనీసం బయట టీ తాగుదాం అంటే భయమేస్తుందండి. అందులో వేసే పంచదార కల్తీ. టీ పౌడర్ కల్తీ, పాలు కల్తీ.. చివరకు పోసే నీళ్లు కల్తీనే. అన్నీ కల్తీలు మిక్స్ అయిన టీ తాగితే మన జీవితం త్వరగా అటకెక్కడం ఖాయం. కొంతలో కొంత పల్లెటూర్లు నయం. స్వచ్ఛమైన గాలితో పాటు స్వచ్చమైన పాలు, కూరగాయలు వంటివి దొరకుతాయి. ఎరువులు, పురుగుమందులు వేయకుండా కూరగాయలు వంటివి పండిస్తారు చాలామంది రైతులు. వాటికే ఇప్పుడు సిటీల్లోనూ మంచి డిమాండ్ ఉంది. పల్లెటూర్లలో చాలామంది ఇళ్లలోనే కూరగాయల మొక్కలను పెంచుకుంటారు. అందుకు తగిన స్థలం ఉంటుంది కాబట్టి. అలానే కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలంలోని పాతఎడ్లలంక గ్రామానికి చెందిన రైతు కోప్పనాతి అంకరాజు ఇంట్లో కూరగాయల చెట్లను పెంచుతున్నాడు. ఆయన 2 సంవత్సరాల క్రితం పెరట్లో దుంప మొక్కను నాటాడు.

తాజాగా కంద గడ్డ కోసం తవ్వగా.. అది ఏకంగా 20 కేజీలపైగా బరువు ఉండంటం చూసి ఆ రైతు స్టన్ అయ్యాడు. జనరల్‌గా కంద దుంపలు మహా అయితే 10 కేజీల లోపే బరువు ఉంటాయి. ఈ రైతు పండించిన దుంప కాటా వేయగా 21 కేజీలు తూగింది. స్థానిక ప్రజలను ఈ దుంప ఆశ్చర్యానికి  గురిచేసింది.  ఇంత పెద్ద కంద దుంపను తామెప్పుడు చూడలేదని గ్రామస్థులు అంటున్నారు. క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడకుండానే కేవలం కుళాయి దగ్గర్లో ఈ మొక్కను పెంచినట్లు సదరు రైతు తెలిపాడు. పోయిన ఏడాది తవ్వకపోవడం.. రెండో సంవత్సరం అవ్వడంతోనే ఇంత సైజులో పెరిగింది అంటున్నాడు.

వీలున్న అందరూ ఇంటి పెరట్లోనే కూరగాయల మొక్కలు పెంచుకుంటే, మనీ సేవ్ అవుతుందని.., క్రిమి సంహారక అవశేషాలు లేని ప్రెష్ వెజిటేబుల్స్‌తో ఆరోగ్యం కూడా బాగుంటుందని.. అంతేకాదుఇంటి ఆవరణం అంతా పచ్చగా ఎంతో సుందరంగా ఉంటుందని ఆ రైతు చెబుతున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..