ప్రియురాలి పెళ్లి.. ప్రియుడు ఉరి..
కులరక్కసి కోరలు చాచింది. అబ్బాయి కులం వేరని పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. ఎంతో గాఢంగా ప్రేమించిన తన ప్రియురాలికి.. కాసేపట్లో పెళ్లి జరుగుతుందన్న వార్తను జీర్ణించుకోలేక పోయాడు ఆ ప్రియుడు. ఇక చేసేది ఏమీ లేక.. మనోవేదనతో చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. ప్రకాశం జిల్లా దర్శిపట్టణానికి చెందిన దుర్గా ప్రసాద్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదివే ఓ యువతిని ప్రేమించాడు. తమ ప్రేమ ఇంట్లో వాళ్ల చెప్పి వారిని ఒప్పించి.. […]
కులరక్కసి కోరలు చాచింది. అబ్బాయి కులం వేరని పెద్దలు వారి పెళ్లికి నిరాకరించారు. ఎంతో గాఢంగా ప్రేమించిన తన ప్రియురాలికి.. కాసేపట్లో పెళ్లి జరుగుతుందన్న వార్తను జీర్ణించుకోలేక పోయాడు ఆ ప్రియుడు. ఇక చేసేది ఏమీ లేక.. మనోవేదనతో చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు.
ప్రకాశం జిల్లా దర్శిపట్టణానికి చెందిన దుర్గా ప్రసాద్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదివే ఓ యువతిని ప్రేమించాడు. తమ ప్రేమ ఇంట్లో వాళ్ల చెప్పి వారిని ఒప్పించి.. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ వారిద్దరి ప్రేమకు.. కులం గోడలు అడ్డొచ్చాయి.
అబ్బాయి కులం వేరే అన్న కారణంతో వారి ప్రేమకు పుల్ స్టాప్ పెట్టారు అమ్మాయి బంధువులు. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా వేరే అబ్బాయితో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్.. యువతి ఊరికి వెళ్లి ఆ యువతిని అడిగేద్దామని అనుకున్నాడు కానీ.. కుదరక శవమై తేలాడు. ఈ విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే.. దుర్గాప్రసాద్‌ను యువతి తరుపు బంధువులే హతమార్చారని ఆరోపిస్తున్నారు యువకుడి తల్లిదండ్రులు.