Konaseema: వరద నీటిలో తాచుపాము, జెర్రిగొడ్డు సయ్యాట.. వీడియో చూస్తే మీరు పక్కాగా షాక్ అవుతారు

|

Jul 15, 2022 | 7:11 PM

వరదనీటిలో రెండు పాములు ఒకదానికి మరొకటి ఎదురుపడ్డాయి. ఈ క్రమంలో..అవి రెండు కూడా ఒకదాని దగ్గరకు మరొకటి వచ్చాయి. ఆ తర్వాత అవి పెనవేసుకుంటూ.. సయ్యాట లాడాయి. ఆ వీడియో చూడండి.

Konaseema: వరద నీటిలో తాచుపాము,  జెర్రిగొడ్డు సయ్యాట.. వీడియో చూస్తే మీరు పక్కాగా షాక్ అవుతారు
Snakes Dance
Follow us on

Viral Video: పాములను అంటే చాలామందికి భయం ఉంటుంది. అలాంటివారు పామును చూస్తే ఆమడదూరం పరిగెడతారు. పొరపాటున పాము కనిపిస్తే.. ఇంకోసారి ఆ దారిదాపుల్లోకి కూడా వెళ్లరు. అయితే ఇలా భయపడే వారు సైతం పాములు గురించి ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ముందుంటారు. సోసల్ మీడియాలో పాములకు సంబంధించి ఏ వీడియో తారసపడ్డా.. చూడకుండా వదలిపెట్టరు. ఈ మధ్యకాలంలో ఎవరికి పాము కనిపించిన తమ సెల్ ఫోన్లో బంధిస్తున్నారు. తాజాగా వరద నీటిలో రెండు పాముల సయ్యాట ఆడిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. కోనసీమ జిల్లా ఐ.పోలవరం(I Polavaram) మండలం మురమళ్ల వద్ద లంకలోని వరద నీటిలో తాచు పాము,  జెర్రి గొడ్డు సయ్యాట ఆడుతూ కనిపించాయి.  మురమళ్ల నుండి కేశనకుర్రు వెళ్లే ఏటి గట్టు మార్గంలో లంకలో పాముల సయ్యటా చూసిన స్థానికులు.. ఆ దృశ్యాలను ఫోన్లలో బంధించారు. వరదల సమయంలో ఇటువంటిదృశ్యాలు అరుదుగా కనిపిస్తాయని వారు చెబుతున్నారు.  అయితే, పాములు సంపర్కం సమయంలో ఇలా సయ్యాట ఆడుతాయని పలువురు చెబుతున్నారు.  రెండు పాములు పడగలు విప్పి ఒకదానికి ఒకటి మెల వేసుకునే దృశ్యం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచాయి. చుట్టూ చాలా మంది గుమిగూడిన అవి వారిని పట్టించుకోకుండా చాలాసేపు పెనువేసుకుంటూ సయ్యాట ఆడాయి. ఆ దృశ్యాలను మీరు దిగువన చూడండి.