Pulasa Fish: మార్కెట్లోకి పులస వచ్చేసిందోచ్.. రెండు కేజీల పులసను వేలంపాటలో భారీ ధరకు దక్కించుకున్న మహిళ

|

Aug 24, 2022 | 10:51 AM

పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెతను నిజం చేస్తూ.. ఈ పులస మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు కొనడానికి భారీ సంఖ్యలో మార్కెట్ కు చేరుకుంటారు. అంతగా డిమాండ్ ఉంటుంది ఈ చేపకు.

Pulasa Fish: మార్కెట్లోకి పులస వచ్చేసిందోచ్.. రెండు కేజీల పులసను వేలంపాటలో భారీ ధరకు దక్కించుకున్న మహిళ
Pulasa Fish
Follow us on

Pulasa Fish: ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే చేప పులస. అత్యంత ఖరీదైన చెప్పగా ఖ్యాతిగాంచిన ఈ చేపకోసం ఏడాది పొడవునా జిల్లావాసులు ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు. పుస్తెలమ్మి అయిన సరే పులస తినాలి అన్న సామెతను నిజం చేస్తూ.. ఈ పులస మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు కొనడానికి భారీ సంఖ్యలో మార్కెట్ కు చేరుకుంటారు. అంతగా డిమాండ్ ఉంటుంది ఈ చేపకు. ధర కూడా డిమాండ్ ను బట్టి వేల రూపాయలు పలుకుతుంది.

తాజాగా గోదావరి వరద ఉధృతి తగ్గడంతో తూర్పుగోదావరికి జిల్లా యానాం చేపల మార్కెట్ లో పులస చేప సందడి చేస్తోంది. మంగళవారం రేవులో భైరవపాలెంకు చెందిన వ్యక్తి పులసకు వేలంపాట నిర్వహించారు. సుమారు 2 కిలోల బరువున్న తాజా పులస చేపను పార్వతి అనే మహిళ భారీ ధరకు కొనుగోలు చేసింది.  పులస ను వేలం పాటలో రూ.19 వేలకు కొనుగోలు చేసింది పార్వతి. ప్రస్తుత సీజన్ లో పులసల అమ్మకం మొదలయ్యాక  ఇదే అధిక ధరని స్థానికులు చెబుతున్నారు.

ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి.. న్యూజిలాండ్ ..  టాంజినీయా దేశాలను దాటుకుని.. హిందూమహాసముద్రంలో ప్రయాణించి అక్కడనుంచి బంగాళాఖాతానికి చేరుకుటుంది పులస. ఎప్పుడైతే ఎగువన వర్షాలకు గోదావరిలోకి ఎర్ర నీరు వస్తుందో ఆ శ్రేష్టమైన మంచి నీటిని త్రాగడానికి గోదావరి సముద్రం కలిసే అంతర్వేదిలో ఇవి ఎదురీది గోదావరిలోకి చేరుకుంటాయి. ప్రస్తుతం ఈ పులసలు ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటలు వేశాయని.. అందుకనే సముద్రంలోంచి గౌతమి పాయలోకి పులసలు తక్కువగా వస్తున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. సంవత్సరంలో జూలై, ఆగష్టు, సెప్టెంబర్ మూడు నెలలు మాత్రమే దొరికే ఈ పులసను గంగపుత్రులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పట్టుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..