Tirupati: చెక్‌పోస్ట్ వద్ద బస్సులో పోలీసుల తనిఖీలు.. ఓ బ్యాగ్ ఓపెన్ చేయగానే.. కళ్లు చెదిరేలా

తిరుపతి జిల్లా బూదనం టోల్‌ప్లాజా దగ్గర ఓ బస్సులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తిరుపతి వెళుతున్న బస్సులో విజయవాడకు చెందిన అరవింద్‌కృష్ణ అనే వ్యక్తి దగ్గర ఓ బ్యాగ్ అనుమానంగా కనిపించింది. వెంటనే చెక్ చేస్తే అందులో పెద్ద మొత్తంలో డబ్బులు కనిపించాయి.

Tirupati: చెక్‌పోస్ట్ వద్ద బస్సులో పోలీసుల తనిఖీలు.. ఓ బ్యాగ్ ఓపెన్ చేయగానే.. కళ్లు చెదిరేలా
Private Bus (Representative image )

Updated on: Jan 10, 2024 | 2:45 PM

అవి సాధారణ తనిఖీలే.. గంజాయి లేదా.. ఇతర మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే అనూహ్య రీతిలో భారి ఎత్తున కరెన్సీ కట్టలు బయటపడ్డాయి.  తిరుపతి జిల్లాలో ఎలాంటి పత్రాల్లేకుండా ఓ ప్రైవేటు బస్సులో తరలిస్తున్న డబ్బుల్ని పోలీసులు సీజ్ చేశారు. చిల్లకూరు మండలం బూదనం సమీపంలోని టోల్‌ప్లాజ్‌ దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్లే బస్సులో..  నూజివీడు ఏరియాకు చెందిన శ్రీరంగం అరవిందకృష్ణ అనే వ్యక్తి దగ్గర ఓ బ్యాగును గుర్తించారు. అనుమానంతో ఓపెన్ చేసి చూస్తే లోపల కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. లెక్కల్లో మొత్తం 19 లక్షలు ఉన్నట్లు తేలింది. ఈ డబ్బుల్ని విజయవాడ ఏరియాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతిలో వేరొకరికి చేర్చాలని పంపినట్లు చెబుతున్నారు. ఈ డబ్బుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో వ్యక్తిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ఎన్నికలకు సమయం సమీపించడంతో ఆంధ్రాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొందరు కోడ్ వచ్చాక ఇబ్బంది అవుతుందని ఇప్పటి నుంచే తాయిళాలు, డబ్బు తమ ప్రాంతాలకు చేరవేస్తుంటారు. దీంతో పోలీసులు టోల్‌ప్లాజాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో విసృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో డబ్బులు పట్టుబడుతున్నాయి. మొన్నామధ్య ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద మిర్యాలగూడ నుండి విజయవాడ వస్తున్న ఆర్టీసి బస్సులో తరలిస్తున్న 69 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఎవరైనా అధిక మొత్తంలో నగదును తీసుకెళుతుంటే.. కచ్చితంగా దానికి సంబంధించిన పత్రాలను కూడా వెంట ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ ఎలాంటి పత్రాలు లేకపోతే.. బ్లాక్ మనీ కింద భావించి సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…