
జగ్గయ్యపేటలో పదవ తరగతి చదువుతున్న 15 సంవత్సరాల గోలి వెంకట గణేష్ అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఉదయం ట్యూషన్‌కు సైకిల్‌పై వెళ్తున్న వెంకట్ గుండె నొప్పితో సైకిల్‌పై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కొంతకాలం క్రితం వెంకట్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. ఇప్పుడు ఆసరాగా ఉంటాడు అనుకున్న వెంకట గణేష్ మృత్యువాత పడటంతో ఆ కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. దేవుగా ఇంత అన్యాయం చేస్తావా అంటూ వెంకట్ చెల్లి, తల్లి శోకశంద్రంలో మునిగిపోయారు.
మంచి చదువు చదివి కుటుంబంకి అండగా ఉంటాడనుకున్న కొడుకు అర్దాంతరంగా మృతి చెందడంతో ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. వెంకట్ తల్లి గతంలో వాలంటీర్‌గా పనిచేయగా.. ప్రస్తుతం కుట్టు మిషన్ కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల గుండెపోటు మరణాలు పెరిగిన సంగతి తెలిసిందే. అప్పటివరకు బానే ఉన్న యువత కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయి తనువు చాలిస్తున్నారు. తాజాగా రెండు పదుల వయసు నిండని బాలుడు హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందటం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.