Winter Storm Crisis: దాహం తీరేది ఎలా..! తాగే నీరు కూడా గడ్డకట్టుకు పోయింది..! ఇది ఎక్కడో తెలుసా..!

|

Feb 20, 2021 | 7:20 PM

Storm Crisis: మంచు శిలాఫలకాలు పేరుకుపోయాయి. ఓ అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌పై పేరుకుపోయిన మంచు ఫలకాలు ఇలా వేలాడుతూ..కనిపిస్తున్నాయి.

Winter Storm Crisis: దాహం తీరేది ఎలా..! తాగే నీరు కూడా గడ్డకట్టుకు పోయింది..! ఇది ఎక్కడో తెలుసా..!
winter storm crisis
Follow us on

Winter Storm Crisis: అగ్రరాజ్యం అమెరికాలో మంచుతుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. విద్యుత్ సరఫరా లేక లక్షలాది మంది అంధకారంలోనే ఉన్నారు. కనీసం తాగడానికి కూడా నీరు దొరకడం లేదు. అమెరికా ఐస్ ఏజ్ రీల్‌ సినిమాను తలపిస్తోంది. ముఖ్యంగా టెక్సస్ స్టేట్ మంచు ఖండంలా మారిపోయింది. ఎక్కడ చూసినా మంచు తప్ప మరేం కనిపించడం లేదు. నీరు కూడా గడ్డకట్టుకుపోయింది.దాంతో జనం ఇళ్లనుంచి బయటకు రావడంలేదు.

మంచులో మునిగిపోయింది అమెరికా. రికార్డ్‌ స్థాయిలో హిమపాతం నమోదవుతోంది. ఎటు చూసినా మంచే కనిపిస్తోంది. మన దగ్గర డీప్ ప్రీజర్‌లో పెడితే గడ్డకట్టే నీళ్లు.. అక్కడ మామూలుగానే ఐస్‌లా మారిపోతున్నాయి. సింక్‌లో ట్యాప్ తిప్పినా.. చివరకు టాయిలెట్‌ కమోడ్‌లోనూ నీళ్లు గడ్డ కట్టుకుపోతున్నాయి.

అక్కడ మంచినీళ్లు తాగాలన్నా.. మంచును బాగా మరిగించి తాగాల్సిందే. అదీ క్షణాల్లోనే తీసుకోవాలి. లేదంటే మళ్లీ గడ్డ కట్టుకుపోతున్నాయి. మైనస్‌ డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలతో గజగజ వణికిపోతున్నారు అమెరికా జనం. పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. మంచు తుపాను కారణంగా ఇప్పటివరకు 30 మంది మృతి చెందారు.

ఇక టెక్సస్‌ అయితే మంచు ఖండంలా మారిపోయింది. 72 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీలకు పడిపోయింది. మాడిసన్ కౌంటీలో మిస్సిస్సిపీ నది గడ్డకట్టుకుపోయింది. నీళ్లు వెదజల్లే ఫౌంటెయిన్‌లు మంచుగడ్డల్లా మారిపోయాయి. వాల్‌మార్ట్ సహా ఇతర ప్రధాన మార్కెట్లు మూతపడ్డాయి.

కొరియర్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. డాలస్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే..మంచుతో నిండిపోవడంతో తొలిగించేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. మంచుతుపాన్లతో టెక్సస్ జనం అల్లాడుతున్నారు. కరోనా వ్యాక్సిన్లు కూడా గడ్డకట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ల పంపిణి నిలిచిపోయింది.

డాలస్‌లో ఫ్యాన్లకు మంచు శిలాఫలకాలు పేరుకుపోయాయి. ఓ అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌పై పేరుకుపోయిన మంచు ఫలకాలు ఇలా వేలాడుతూ..కనిపిస్తున్నాయి. ఫ్యాన్లకే కాకుండా ఇళ్ల గోడలు కూడా మంచుతో నిండిపోతున్నాయి. ఇలాంటి దృశ్యాలు..అమెరికాలో సర్వసాధారణంగా మారిపోయాయి. పై కప్పులపై రోజుల తరబడి మంచుపేరుకుపోవడంతో పై భాగాలు కూలుతున్నాయి.

దాదాపు 40 లక్షల మంది తాగేందుకు నీళ్లు, కరెంట్‌ లేక విలవిలలాడిపోతున్నారు. టెక్సస్‌తో పాటు అలబామా, ఒరెగాన్‌, ఓక్లహామా, కన్సాస్‌, కెంటకీ, మిసిసిపి రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో వార్మింగ్‌ సెంటర్లు ఏర్పాటుచేసింది ప్రభుత్వం.

ఇదంతా ఒక ఎత్తైతే.. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సీన్‌ మరో ఎత్తు. హూస్టన్‌లో తెలుగువారి కష్టాలకు నిదర్శనమే ఈ దృశ్యాలు. ఓ ఎన్నారై జంట ఇలా గడ్డకట్టిన మంచులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక నరకయాతన అనుభవించింది. సమాచారం అందుకున్న యూఎస్‌ కాప్స్‌.. అతి కష్టమ్మీద వారిని ఒడ్డుకు చేర్చి.. అపస్మారక స్థితిలో ఉన్న వారిని హాస్పిటల్‌కు తరలించారు.

ఐతే గత వారం రోజులతో పోలిస్తే..ఇప్పుడు పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. హిమపాతం కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌ గ్రిడ్‌ పునరుద్ధరణ కొనసాగుతోంది. దీంతో నాలుగు రోజులుగా చీకట్లో మగ్గిన టెక్సస్‌లో పలు ప్రాంతాల్లో..విద్యుత్‌ను పునరుద్ధరిస్తున్నారు.

వర్జీనియా, లూసియానా ప్రాంతాల్లోనూ వేల సంఖ్యలో ఇళ్లు చీకట్లోనే ఉన్నాయి. ఇండియా.. ప్రత్యేకించి తెలుగురాష్ట్రాలకు చెందిన ఐటి ఫ్యామిలీస్ టెక్సాస్‌ సహా డాలస్‌లో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితిని తామెప్పుడూ చూడలేదంటున్నారు. టెక్సాస్‌ మొత్తం ఫ్రీజ్‌ వడంతో ఎన్నడూ లేనంతగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచు తుఫాను బీభత్సం నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఎదురుచూస్తున్నారు. 1989 తర్వాత అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారని..మరికొద్ది రోజులు ఈ భారీ హిమపాతం తప్పదంటున్నారు.

ఇవి కూడా చదవండి

Kamal Haasan Meets Rajinikanth: తలైవాతో ముగిసిన కమల్‌హాసన్ సమావేశం.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ..
Rare Yellow Penguin: ఫోటోగ్రాఫర్‌కు ప్రకృతి అందించిన అరుదైన లాటరీ..! నెట్టింట్లో రింగులు కొడుతున్న ఎల్లో ‌పెంగ్విన్..
Australian Open 2021: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సరికొత్త చరిత్ర.. టైటిల్ గెలుచుకున్న నవోమి ఒసాకా..