అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ?

| Edited By: Anil kumar poka

Sep 09, 2020 | 5:29 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్ద్ ట్రంప్ కు 2021 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతినివ్వాలంటూ నార్వేజియన్ ఎంపీ ఒకరు ఆయన పేరును నామినేట్ చేశారు. ఇజ్రాయెల్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ?
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్ద్ ట్రంప్ కు 2021 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతినివ్వాలంటూ నార్వేజియన్ ఎంపీ ఒకరు ఆయన పేరును నామినేట్ చేశారు. ఇజ్రాయెల్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య శాంతి ఒప్పందాన్ని కుదర్చడంలో ట్రంప్ కీలక పాత్ర వహించారని ‘టిబ్రింగ్ జెడ్డే’ అనే ఎంపీ తన నామినేషన్ లెటర్లో పేర్కొన్నారు. నార్వే పార్లమెంటుకు నాలుగు సార్లు ఎన్నికైన ఈయన ‘నాటో పార్లమెంటరీ అసెంబ్లీకి నిర్దేశించిన నార్వేజియన్ డెలిగేషన్ బృంద చైర్మన్ కూడా.. ఇజ్రాయెల్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య కుదిరిన ఒప్పందం మధ్య ప్రాచ్య దేశాల మధ్య సహకారం మరింతగా పెరిగేందుకు దోహదపడుతుందని, ఇది ఓ ‘గేమ్ ఛేంజర్’ అని అభివర్ణించారు. మిడిల్ ఈస్ట్ నుంచి పెద్ద సంఖ్యలో అమెరికన్ దళాలను ఉపసంహరించినందుకు ట్రంప్ ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. కాగా 1906 లో రూజ్ వెల్త్, 1920 లో వుడ్రో విల్సన్, 2002 లో జిమ్మీ కార్టర్, 2009 లో బరాక్ ఒబామా నోబెల్  బహుమతి గ్రహీతలయ్యారు.

అయితే వచ్ఛే ఏడాది అక్టోబరు  వరకు ఆ సంవత్సరానికి ఎవరు నోబెల్ బహుమతి విజేతలన్నది తెలియదు.