ఇజ్రాయెల్, గాజాలో హింసపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర ఆందోళన, బెంజమిన్ నెతన్యాహు, అబ్బాస్ లకు ఫోన్లు, శాంతియుత ఒప్పందానికి రావాలని సూచన

| Edited By: Anil kumar poka

May 16, 2021 | 11:48 AM

ఇజ్రాయెల్, గాజా సిటీలో జరుగుతున్న హింసపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ లతో వేర్వేరుగా ఫోన్ లో మాట్లాడారు....

ఇజ్రాయెల్, గాజాలో హింసపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర ఆందోళన, బెంజమిన్ నెతన్యాహు, అబ్బాస్ లకు ఫోన్లు, శాంతియుత ఒప్పందానికి రావాలని సూచన
Us President Joe Boiden Condemn Violance Between Israel And Hamas Terrorists
Follow us on

ఇజ్రాయెల్, గాజా సిటీలో జరుగుతున్న హింసపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ లతో వేర్వేరుగా ఫోన్ లో మాట్లాడారు.ఉభయ పక్షాలూ వెంటనే పరస్పర దాడులను నిలిపివేయాలన్నారు. గాజాసిటీలో వందలాది అమాయకుల మృతిపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ.. ఇజ్రాయెల్ సంయమనంతో వ్యవహరించాలన్నారు. గాజాలో అంతర్జాతీయ మీడియా సంస్థలపై వైమానిక దాడుల పట్ల కూడా బైడెన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జర్నలిస్టుల భద్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. నిన్న గాజాలోని అంతర్జాతీయ మీడియా సంస్థలపై ఇజ్రాయెల్ నేరుగా వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఆల్ జజీరా, అసోసియేటెడ్ ప్రెస్ కార్యాలయాలతో సహా పలు స్థానిక ఆపీసులు కూడా దెబ్బ తిన్నాయి. తనను తానురక్షించుకునే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని అంటూనే..పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ తో కూడా మాట్లాడి..హమాస్ రాకెట్ దాడులను నిలిపివేయాలన్నారు. సమస్య పరిష్కారానికి రెండు పక్షాలూ కూర్చుని చర్చించుకోవాలని, సమగ్ర ఒప్పందానికి రావాలని బైడెన్ సూచించారు. అటు హమాస్ ఇతర టెర్రరిస్టు గ్రూపులు ఇజ్రాయెల్ పౌరులను టార్గెట్ చేయడాన్ని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఖండించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ బెంజమిన్ గాంట్స్ తో ఫోన్ లో మాట్లాడిన లాయిడ్.. హమాస్ ఉగ్రవాదులపై మీరు జరుపుతున్న దాడులు సమర్థనీయమేనన్నారు. మీ రక్షణకు మీరు చర్యలు తీసుకోవలసిందే అన్నారు.
ఐక్యరాజ్య సమితి కూడా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పోరును ఖండించింది. నిన్న గాజా సిటీలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మృతి చెందారు.

మరిన్ని చదవండి ఇక్కడ : 5 tigers and 1 monkey viral video :ఒకేసారి ఐదు పులుల్ని ముప్పతిప్పలు పెట్టిన వానరం..కోతి చేష్టలుకు అల్లాడిపోయిన పులులు.

స్నేహమంటే ఇదేరా ? జాతివైరం లేని మూగ మిత్రులు..ట్రెండ్ అవుతున్న గొరిల్లా మరియు తాబేలు వైరల్ వీడియో ..: Gorilla and Tortoise ViralVideo

సాయం పొందిన రియల్ హీరో..! ఆ అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు – సోను సూద్ :Sonu Sood video.