Corona Treatment: కరోనాతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరితే బిల్లు తడిసి మోపెడవుతోంది. కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాలంటేనే జంకుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. నాలుగు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినందుకు ఆస్పత్రి యాజమాన్యం వేసిన బిల్లుకు మైండ్ బ్లాక్ అయిపోయింది. దీంతో ఆ బిల్లును వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు బాధితుడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. నాలుగు నెలల చికిత్స చేయించుకున్నందుకు ఆ హాస్పిటల్ 3 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 కోట్లు) బిల్లు వేసింది. ఈ వివరాలను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. బిల్లుల్లును చూసి న నెటిజన్లు షాకయ్యారు. లెట్స్టేక్ అబౌట్ బిజినెస్ పేరుతో ఈ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు ఆ వ్యక్తి. ప్రతీ సర్వీస్‌కు వేసిన ధరల వివరాలను వీడియోలో స్పష్టంగా వివరించారు. క్రిటికల్ కేర్, మెడికల్ స్కాన్స్‌తో పాటు మిగిలిన సేవలు ఆ జాబితాలో ఉన్నాయి. ఇక ఈ వీడియోకు కొన్నిరోజుల్లోనే దాదాపు 95 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ బిల్లుకు షాకైన చాలా మంది కామెంట్లు చేశారు. అయితే ఇవి ఆసుపత్రి బేసిక్ రేట్స్ అని, ఒకవేళ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బిల్లు చాలా తగ్గేదని కొందరు యూజర్లు కామెంట్ చేయగా.. మరికొందరు షాకయ్యామంటూ కామెంట్ చేశారు.
అయితే అమెరికాలో వైద్య ఖర్చులు భారీగానే ఉంటాయి. చికిత్స విషయంలో ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో వైద్య సదుపాయాలు కూడా అత్యంత అధునాతనంగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యత్తమ సౌకర్యాలు ఉంటాయి. అయితే మధ్య తరగతి ప్రజలు ఈ ఖర్చులను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. కాగా, అమెరికాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో ఆసుపత్రిలో చేరాడు. నాలుగు నెలల చికిత్స అనంతరం వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. వైరస్ నుంచి జయించడంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కానీ బిల్లు చూసిన అతనికి గుండెపోటు వచ్చేంత పనైంది. దీనికి సంబంధించిన రసీదును సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో వైపు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒక వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.