అమెరికా మంత్రి మైక్ పాంపియోపై హౌస్ కమిటీ ఫైర్

| Edited By: Anil kumar poka

Aug 29, 2020 | 12:04 PM

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పై హౌస్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ భగ్గుమంది. ఆయనపై పాలనా వ్యవహారాల ధిక్కరణ కింద చర్యలు చేపడతామని హెచ్ఛరించింది. 

అమెరికా మంత్రి మైక్ పాంపియోపై హౌస్ కమిటీ ఫైర్
Follow us on

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పై హౌస్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ భగ్గుమంది. ఆయనపై పాలనా వ్యవహారాల ధిక్కరణ కింద చర్యలు చేపడతామని హెచ్ఛరించింది.  తన శాఖ ఆర్ధిక వనరులకు సంబంధించి జరిగిన దుర్వినియోగంపై పారదర్శకంగా రికార్డులను సమర్పించడానికి ఆయన నిరాకరించడాన్ని డెమోక్రాట్ ఎలియట్ ఏంజెల్ చైర్మన్ గా గల కమిటీ తప్పు పట్టింది. అసలు ఆయనకు తమ ప్రభుత్వ చట్టాలు, శాసనాల గురించి తెలుసా అని ఎలియట్ ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిని నిరోధించడానికి గల  రాజ్యాంగ బద్ద చట్టాలను మైక్ పాంపియో వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు.

తన పదవి, తన సిబ్బంది, తన ప్రభుత్వ ఖర్చులను ఆయన తన రాజకీయ వ్యక్తిగతమైనవిగా పరిగణిస్తున్నారని ఈ కమిటీ ఆరోపించింది.