US declares state of emergency as cyber attack: అమెరికాలో సైబర్ అటాక్‌తో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతోపాటు అమెరికా ఇంధన సరఫరాలో కీలకమైన తూర్పు తీర ఇంధన పైప్‌లైన్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పైప్‌లైన్‌ను జార్జియాకు చెందిన కలోనియల్ పైప్‌లైన్ నిర్వహిస్తోంది. ఆ సంస్థపై రాన్సమ్‌వేర్ సైబర్‌దాడి జరగడంతో పైప్‌లైన్ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ నిలిపివేత ప్రభావం దేశంలోని ఇంధన సరఫరా, ధరలపై ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పైప్‌లైన్ మూసివేయడానికి గల కారణం.. డార్క్‌సైడ్ అని పిలువబడే ఒక క్రిమినల్ ముఠా అని అధికారులు తెలిపారు. అయితే ఈ సైబర్ క్రైం వ్యక్తులు పలు సంస్థలపై సైబర్ అటాక్ చేసి.. పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేస్తారు.
ఈ సైబర్ అటాక్‌తో దాదాపు మూడు రోజులుగా ఇంధన సరఫరా ప్రభావితం అయింది. సైబర్ అటాక్ నుంచి రక్షించేందుకు, అంతరాన్ని నివారించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు సంబంధించిన నిబంధనలను సడలించింది. అయితే.. జార్జియాకు చెందిన కలోనియల్ పైప్‌లైన్ ద్వారా టెక్సాస్ నుంచి ఈశాన్యానికి గ్యాసోలిన్.. ఇతర ఇంధనాన్ని సరఫరా చేస్తారు. ఇది తూర్పు తీరంలో వినియోగించే ఇంధనంలో సుమారు 45% సరఫరా చేస్తుందని కంపెనీ వెల్లడించింది.
అయితే ఈ దాడిని ర్యాన్సమ్‌వేర్‌గా అధికారులు ప్రకటించారు. హ్యాకర్లు సాధారణంగా డేటాను దొంగలించడం, నెట్‌వర్క్‌లను స్తంభింపజేయడం ద్వారా కంప్యూటర్ సిస్టమ్‌లను లాక్ చేస్తారు. ఆపై దానిని సజావుగా నడిచేందుకు డబ్బును డిమాండ్ చేస్తారు. అయితే.. ప్రస్తుతం హ్యాకర్లు ఏం డిమాండ్ చేశారన్నది అధికారులు వెల్లడించలేదు. కలోనియల్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Also Read: