ట్రంప్ అసాధ్యం అన్నాడు.. ఈ బుడ్డది సుసాధ్యం చేసింది!

అమెరికా-మెక్సికో సరిహద్దు వెంబడి పెద్ద గోడ కట్టేస్తా.. తద్వారా మెక్సికో నుంచి అక్రమావలసలను నిరోధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.  తను కట్టబోయే గోడను ఎవరూ ఎక్కలేరని వెళ్లిన ప్రతి చోటల్లా ఘంటాపథంగా చెప్తూనే వచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ విసిరిన ఈ సవాల్‌ను రిక్ వెబర్ అనే పర్వాతారోహకుడు స్వీకరించి.. సరిగ్గా ట్రంప్ నిర్మిస్తానని చెప్పినట్లుగా ఉండే ఓ గోడను నిర్మించేశాడు. ఇక ఆ గోడను లూసీ హాం‌కాక్ అనే 8 ఏళ్ళ […]

ట్రంప్ అసాధ్యం అన్నాడు.. ఈ బుడ్డది సుసాధ్యం చేసింది!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 13, 2019 | 11:53 PM

అమెరికా-మెక్సికో సరిహద్దు వెంబడి పెద్ద గోడ కట్టేస్తా.. తద్వారా మెక్సికో నుంచి అక్రమావలసలను నిరోధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.  తను కట్టబోయే గోడను ఎవరూ ఎక్కలేరని వెళ్లిన ప్రతి చోటల్లా ఘంటాపథంగా చెప్తూనే వచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ విసిరిన ఈ సవాల్‌ను రిక్ వెబర్ అనే పర్వాతారోహకుడు స్వీకరించి.. సరిగ్గా ట్రంప్ నిర్మిస్తానని చెప్పినట్లుగా ఉండే ఓ గోడను నిర్మించేశాడు. ఇక ఆ గోడను లూసీ హాం‌కాక్ అనే 8 ఏళ్ళ బుడ్డది అవలీలగా ఎక్కేసింది.

వివరాల్లోకి వెళ్తే కెంటకీ నగరంలో ఉన్న ముయిర్ వ్యాలీకి చెందిన రిక్ వెబర్ ట్రంప్ వ్యాఖ్యల్లోని నిజానిజాల్ని తేల్చేందుకు అచ్చు ట్రంప్ చెప్పిన విధమైన గోడను.. కొలతల దగ్గర్నుంచి నిర్మాణానికి ఉపయోగించే పదార్ధాల వరకు అన్నీ కూడా సేమ్ టూ సేమ్ దింపేశాడు.  ఇక ఈ గోడను చాలామంది తాళ్ల సహాయంతో ఎక్కి చూపించారు. అయితే లూసీ హాం‌కాక్(8) మాత్రం ఎటువంటి సాయం లేకుండానే వట్టి చేతులతో అవలీలగా ఎక్కేసింది. ఇప్పుడు దీని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.facebook.com/karla.r.hancock/videos/10215029420793422/