యూరప్ వాసులకిక నో ఎంట్రీ.. ట్రంప్.. బోర్డర్స్ క్లోజ్
యూరప్ దేశాల వాసులంతా 30 రోజులపాటు అమెరికాలో ప్రవేశించరాదని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే యూరప్ దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించడమే కాకుండా.. ఆ దేశాలతో తమ దేశానికి గల బోర్డర్లన్నీ మూసివేస్తున్నట్టు తెలిపారు.
యూరప్ దేశాల వాసులంతా 30 రోజులపాటు అమెరికాలో ప్రవేశించరాదని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే యూరప్ దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించడమే కాకుండా.. ఆ దేశాలతో తమ దేశానికి గల బోర్డర్లన్నీ మూసివేస్తున్నట్టు తెలిపారు.ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు. అయితే ఒక్క బ్రిటన్ కు మాత్రం మినహాయింపునిచ్చారు. (ఇటీవలే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగిన సంగతి తెలిసిందే). వైట్ హౌస్ లోని తన ఓవల్ ఆఫీసు నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. మొట్ట మొదటిసారిగా కరోనా వైరస్ ప్రమాదాన్ని ప్రస్తావించారు. ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోందని, అత్యంత జాగరూకత వహించాలని ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరించిన వెంటనే ట్రంప్.. దీని బారి నుంచి తమ దేశ ప్రజలను రక్షించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తికి యూరోపియన్ యూనియన్ కారణమని ట్రంప్ ఆరోపించారు. అసలీ కరోనా ‘విదేశాల నుంచి’ వచ్చిందని, పేర్కొన్న ఆయన.. అమెరికన్లు తరచూ తమ చేతులను శుభ్రపరచు కుంటూ ఉండాలని, వృధ్ధులు సోషల్ కాంటాక్ట్ లోకి రాకూడదని సూచించారు. కరోనా బాధితులకు, వారికి అండగా ఉంటున్నవారికి తమ ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. తమ దేశానికి మించి మరే దేశమూ కరోనా అదుపునకు గట్టి చర్యలు తీసుకోవడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు.