అమెరికాలోని డల్లాస్‌లో టీడీపీ నేత కేసీ చేకూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31 రాత్రి టీడీపీ – జనసేన మధ్య జరిగిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారింది. పరస్పర దాడులతో కలకలం చెలరేగింది. ఇదే కేసులో చేకూరిని అరెస్ట్ చేసిన పోలీసులు మొదటి కారల్టెన్ పోలీసు స్టేషన్ కి తరలించారు. ఆ తరువాత డల్లాస్ స్టేషన్‌కి మార్చారు.
తెలుగు ఎన్నారై అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన డిసెంబర్ 31 రాత్రి పార్టీలో టీడీపీ జనసేన వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. నూతన సవంత్సరం వేడుకల్లో.. మ్యూజికల్ నైట్ పాటల సెలక్షన్‌లో.. బాలయ్య అభిమానులు , పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ NRI విభాగం ముఖ్యుడు కేసీ చేకూరి పవన్ అభిమానుల మీదకి దూసుకెళ్ళాడు. దీంతో రెచ్చిపోయిన పవన్ అభిమానులు తిరగబడ్డారు. ఆ తరువాత గొడవ చినికి చినికి గాలివానలా మారింది. సర్ది చెప్పటానికి ప్రయత్నించిన ఈవెంట్ మేనేజర్లపై పిడిగుద్దులుతో విరుచుకుపడ్డాడు కేసీ చేకూరి. వారి ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు చేకూరిని అరెస్ట్ చేశారు పోలీసులు. రంగంలోకి దిగిన టీడీపీ తానా పెద్దలు.. జనసేన సభ్యులతో రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి