అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నార్త్ వెస్టర్న్ డీసీ, సదరన్ మాంటోగోమరీ, ఈస్ట్ సెంట్రల్ లండన్, అర్లింగ్టన్, ఫాల్స్ చర్చ్, నార్త్ ఈస్టర్న్ ఫైర్ ఫాక్స్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు నగరాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు జలమయం కావడంతో కొన్ని ప్రాంతాల్లో కార్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనాలపైకి, బిల్డింగ్‌లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటివరకు మొత్తం 15 మందిని సహాయక సిబ్బంది కాపాడారు.
మరోవైపు వర్షాలు, వరదల ప్రభావం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పైనా పడింది. శ్వేతసౌధం బేస్‌మెంట్‌లోని కార్యాలయాల్లోకి వరదనీరు చేరింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం రోజున వాషింగ్టన్‌లో కురిసిన భారీ వర్షం ప్రమాదకర పరిస్ధితులను ఏర్పరిచిందని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని.. బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.