America President Joe Biden Rating: అప్పుడే బైడెన్‌కు షాక్. ఇక నీవు వద్దు ముర్రో అంటూ జనం కోడం కూస్తోంది. ఈ మధ్య జరిపిన సర్వేలో 66 శాంత మంది బైడెన్ పాలనపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో అధ్యక్షుడిగా సమర్ధవంతంగా పని చేయడం లేదంటున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరిగి పోతోంది. అంతే కాదు.. 2024లో మళ్లీ అద్యక్షుడిగా పోటీ చేయ్యొద్దంటూ మొర పెట్టుకుంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పనితీరు పట్ల అక్కడి ప్రజలు అంతగా సంతృప్తిగా లేరని తాజా సర్వేలో వెల్లడైంది. అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేస్తున్నారని భావించే ప్రజల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. సుమారు 50 శాతం మంది.. బైడెన్ తిరిగి పోటీ చేయకూడదని అభిప్రాయపడుతున్నారు. అయితే.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు విడుదలయ్యాయి. అధ్యక్ష పదవిని సరిగా నిర్వహించడం లేదని మెజారిటీ ప్రజలు బైడెన్‌ను విమర్శించారు. కరోనా మహమ్మారి, ధరల పెరుగుదల కారణంగా బైడెన్ గ్రాఫ్ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఎజెన్సీ అసోసియేటెడ్-NORC, సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ కలిసి ఈ సర్వే చేపట్టాయి. జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారని 43 శాతం మంది మాత్రమే ఓటేశారు. జులైలో నిర్వహించిన ఇదే తరహా సర్వేలో 59 శాతం బైడెన్ అధ్యక్ష బాధ్యతలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో ఇది 50 శాతంగా ఉంది.
కరోనా నియంత్రణలోనూ బైడెన్ పనితీరుపై కూడా అనేక మంది నుంచి అసంతృప్తి వ్యక్తం చేశారు. 45 శాతం మంది మాత్రమే కరోనాపై బైడెన్ పనితీరు సంతృప్తికరంగా స్పందించారు. 2021 జులైలో 66 శాతం, డిసెంబర్లో 57 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2024 ఎన్నికల్లో బైడెన్ తిరిగి పోటీ చేయాలని 28 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. 2024లో పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధంగానే ఉంటారని వీరు విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, 50 శాతం మంది మాత్రం.. బైడెన్ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండలేరని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక వ్యవస్థ విషయంలో 37 శాతం మంది మాత్రమే బైడెన్‌ను మెచ్చుకున్నారు. కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ పనితీరు, పన్ను విధానాలు, అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగడం వంటి అంశాల వల్ల ఆయన గ్రాఫ్ పడిపోయినట్లు తెలుస్తోంది. బైడెన్ అధ్యక్షుడయ్యాక దేశం ఐకమత్యం సాధించిందని 16 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా.. అమెరికా మరింత విభజనకు గురైందని 43 శాతం మంది పేర్కొన్నారు. వైట్ హౌస్‌ని సమర్థంగా నిర్వహించే సత్తా బైడెన్‌కు లేదన్న వారు 38 శాతం ఉన్నారు. 28 శాతం మంది మాత్రమే సంపూర్ణ విశ్వాసం చూపారు. 33 శాతం మంది బైడెన్‌ను కొంతవరకు నమ్ముతున్నట్లు తెలిపారు. అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పటితో పోలిస్తే బైడెన్ మెరుగైన స్థితిలోనే ఉన్నారని సర్వే పేర్కొంది. 2018 ఫిబ్రవరిలో ట్రంప్ పనితీరును 35 శాతం మంది మెచ్చుకోగా.. తాజాగా బైడెన్‌ను 33 శాతం మంది ఆమోదించారని తెలిపింది.
అయితే.., ఈ సర్వేను బైడెన్ ఆమోదించలేదు. అధ్యక్షుడి మానసిక ఆరోగ్యంపై అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా.. బైడెన్ వాటిని ఖండించారు. ఈ సర్వేలను నేను నమ్మనంటూ వ్యాఖ్యానించారు.