కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ టెంపుల్ పునరుద్ధరణ పనుల తర్వాత కొత్త రూపు సంతరించుకుంటూ తలుపులు తెరుచుకుంది. క్రైస్తవ చర్చ్‌గా 55ఏళ్ల క్రితం ఓక్లాండ్ టెంపుల్ నిర్మాణం జరిగింది. మే 7 నుంచి జూన్ 1 వరకు అతిథుల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది. టెంపుల్ టూర్‌కు తెలుగు ప్రవాసులకు ఆహ్వానం పలుకుతున్నారు టెంపుల్ ప్రతినిధులు. మాతాశిశు మరణాల అరికట్టటం లాంటి ఎన్నో సేవలు టెంపుల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.