US Snow Strom: శీతల గాలుల ఎఫెక్ట్.. జీవం ఉన్నా.. జీవశ్ఛవాలుగా మారిన మూగ జీవులు.. అధికారులు పలు సూచనలు..

|

Jan 31, 2022 | 3:52 PM

US Snow Strom: ఉత్తర అమెరికా(North America ) చలితో గజగజా వణికిపోతుంది. మంచు తుఫాను(US Snow Strom) దాటికి జనజీవనం స్థంభించి పోయింది. పలు రాష్ట్రాలు స్నో అలర్ట్‌(Snow Alert) ప్రకటించాయి. రోడ్ల మీదికి..

US Snow Strom: శీతల గాలుల ఎఫెక్ట్.. జీవం ఉన్నా.. జీవశ్ఛవాలుగా మారిన మూగ జీవులు.. అధికారులు పలు సూచనలు..
Raining Iguanas In South Fl
Follow us on

US Snow Strom: ఉత్తర అమెరికా(North America ) చలితో గజగజా వణికిపోతుంది. మంచు తుఫాను(US Snow Strom) దాటికి జనజీవనం స్థంభించి పోయింది. పలు రాష్ట్రాలు స్నో అలర్ట్‌(Snow Alert) ప్రకటించాయి. రోడ్ల మీదికి వాహనాలతో రావొద్దంటూ ఎమర్జెన్సీ ప్రకటించాయి. విపరీతంగా కురుస్తున్న మంచుతో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోవడిపోతున్నాయి. ఈ క్రమంలో ఇగ్వానస్‌ అనే ఊసరవెల్లి తరహా జీవులు సజీవ శవాలుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ ప్రాణంతో ఉన్నా శవాల్లా పడిపోతున్నాయి. దీంతో యూఎస్‌ వాతావరణ శాఖ అక్కడి ప్రజలకు పలు కీలక సూచనలు జారీ చేసింది.

ఇగ్వానస్‌ శరీరంలో చల్లని రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఉష్ణోగ్రత్తలు మైనస్‌ 4 డిగ్రీల నుంచి మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంటే ఇవి తట్టుకోలేవు. ఉన్న పళంగా అచేతనంగా మారిపోతాయి. చచ్చిన శవంలా ఎక్కడివక్కడే పడిపోతాయి. ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలో రోడ్ల మీద ఇళ్ల పక్కన, పార్కుల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ జీవులు చనిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్క సారి ఉష్ణోగ్రత పెరిగితే ఇవి సాధారణ స్థితికి చేరుకుంటాయి. కాబట్టి వాటికి ఎటువంటి హానీ తలపెట్టవద్దంటూ స్థానిక అధికారులు సూచిస్తున్నారు. స్నో అలర్ట్‌ హెచ్చరికల నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ఫ్లోరిడా ద్వీపకల్పంలో అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ మంచు తుఫాన్ గత నాలుగేళ్లలో అత్యధికమని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. రహదారులు, రోడ్లు, పలు ప్రాంతాలు మంచుతో కప్పబడ్డాయి. అనేక రాష్ట్రాల గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప రోడ్లమీదకు రావద్దంటూ సూచించారు.

Also Read:

  కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడిని.. సోమవారం ఏ విధంగా పూజ చేయాలంటే..