Monster Storm: న్యూ యార్క్ ప్రజలకు న్యూ ఇయర్ కానుకనిచ్చిన సూర్యుడు.. ఎట్టకేలకు దర్శనం.. మంచుతొలగిస్తున్న సిబ్బంది

|

Dec 30, 2022 | 2:49 PM

గత కొన్ని రోజులుగా అమెరికాలో కురిసిన మంచు తుఫానుతో విద్యుత్‌ నిలిచిపోయింది. దీంతో ఆక్సిజన్‌ వెంటిలేషన్‌ మీద ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సహాయం అందక కొందరు మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Monster Storm: న్యూ యార్క్ ప్రజలకు న్యూ ఇయర్ కానుకనిచ్చిన సూర్యుడు.. ఎట్టకేలకు దర్శనం.. మంచుతొలగిస్తున్న సిబ్బంది
Monster Storm In Uk
Follow us on

కొద్ది రోజులుగా మంచుతుఫానుతో అల్లాడిపోయిన అమెరికా ప్రజలకు ఎట్టకేళకు సూర్యుడు దర్శనమిచ్చాడు. న్యూయార్క్‌ రాష్ట్రంలోని బఫెలో సిటీలో ఎట్టకేలకు సూర్యరశ్మి కనిపించింది. డిసెంబర్‌ 29 ఉదయం సూర్యుడి రాకతో కాసేపు వాతావరణం వెచ్చగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి నేషనల్‌ గార్డ్‌ అధికారులు ఇంటింటికి వెళ్తున్నారు. విద్యుత్‌ సౌకర్యం పోయిన ఇళ్లకి వెళ్లి వారి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

మంచు తుఫాను సమయంలో విద్యుత్‌ నిలిచిపోవడంతో ఆక్సిజన్‌ వెంటిలేషన్‌ మీద ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సహాయం అందక కొందరు మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రహదారులపై కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచు కరిగితే ఇంకా ఎన్ని మృతదేహాలు బయటకు వస్తాయోనన్న ఆందోళన నెలకొంది. కాగా బఫెలో నగరంలో రాకపోకల్ని పునరుద్ధరించారు. భారీ యంత్రాల సాయంతో రహదారులపై ముంచెత్తిన మంచుని తొలగించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని బఫెలో నగర మేయర్‌ బైరన్‌ బ్రౌన్‌ వెల్లించారు.

ఇవి కూడా చదవండి

అత్యవసరమైతే తప్ప ఇంకా ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆయన నగర ప్రజలను హెచ్చరించారు. అమెరికాలోని మరికొన్ని రాష్ట్రాల్లో మంచు ముంచేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో నీటి పైపులు పగిలిపోయి ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..