AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసం వద్ద వ్యక్తి అరెస్ట్, గన్, మందుగుండు సామాగ్రి స్వాధీనం,

అమెరికా ఉపాధ్యక్షురాలు  కమలా హారిస్ నివాసం వద్ద అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి కారు నుంచి గన్, మందుగుండు తూటాలను స్వాధీనం చేసుకున్నారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా  హారిస్ నివాసం వద్ద వ్యక్తి అరెస్ట్, గన్, మందుగుండు  సామాగ్రి స్వాధీనం,
Man Arrested Near Vice President Kamala Harris's  House In Us
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 18, 2021 | 1:26 PM

Share

అమెరికా ఉపాధ్యక్షురాలు  కమలా హారిస్ నివాసం వద్ద అనుమానాస్పదంగా కనబడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడి కారు నుంచి గన్, మందుగుండు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. టెక్సాస్ లోని  శాన్ ఆంటోనియో కి చెందిన ఈ వ్యక్తిని  31 ఏళ్ళ పాల్ ముర్రేగా గుర్తించారు. అయితే తన కారును వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ కి కొన్ని మైళ్ళ దూరంలోని ఓ గ్యారేజీలో పార్క్ చేశానని ముర్రే చెప్పాడు. ఇతని కారులో పోలీసులు ఓ రైఫిల్, పలు లైవ్ తూటాలు,  గన్ క్లిప్స్ ను కనుగొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ముర్రే వద్ద’ఏ ఆర్ సెమి-ఆటోమేటిక్   రైఫిల్, రిజిస్టర్ కాని  113 రౌండ్ల అమ్యూనిషన్,  5 మేగజైన్లను’ చూశామని పోలీసులు చెప్పారు. ఒక్కో మేగజైన్ లో 30 తూటాలు అమర్చే వీలుందన్నారు. కమలా హారిస్ నివాసానికి సమీపంలో  నిన్న మధ్యాహ్నం ముర్రెని సీక్రెట్ సర్వీసు అధికారులు అడ్డగించి  ప్రశ్నించినపుడు తలాతోకాలేని సమాధానాలు చెప్పాడట. అయితే కమలా హారిస్, ఆమె భర్త డౌగ్ ఎమ్ హాఫ్ ఈ ఇంట్లిలో నివసించడం లేదు. వీరు వైట్ హౌస్ కి దగ్గరలోని బ్లేయిర్ హౌస్ లో ఉంటున్నారు.

కాగా ముర్రేపై ఇదివరకే కొన్ని కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.టెక్సాస్ నివాసి అయిన ఇతడు పోలీసుల వాంటెడ్ లిస్ట్ లో ఉన్నట్టు సమాచారం.  టెక్సాస్ నుంచి అందిన ఇంటెలిజెన్స్ రిపోర్టును పురస్కరించుకుని ఇతడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే అమెరికాలో ప్రముఖుల ఇళ్ళు, కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. ముఖ్యంగా ఆసియన్ అమెరికన్ ప్రముఖుల ఇళ్ళ వద్ద కనీవినీ ఎరుగని భద్రతను కల్పించారు.  ఈ నెల 16 న అట్లాంటా లోని మూడు స్పా లలలో చొరబడిన యువకుడు 8 మందిపై కాల్పులు జరిపి వారిని పొట్టన బెట్టుకున్నాడు. వీరిలో ఆరుగురు ఆసియన్ మహిళలున్నారు. ఇది జాతి విద్వేష ఘటనా అన్న విషయాన్ని పోలీసులు ఇప్పటివరకు కన్ఫామ్ చేయలేదు.

మరిన్ని చదవండి ఇక్కడ : కదులుతున్న కారులోంచి పడిపోయిన చిన్నారి..షాక్ అవుతోన్న నెటిజెన్ల : child fell out in running car video

అనుపమ గుండె ముక్కలైపోయిందా..? ఆ పోస్టులు బుమ్రాను ఉద్దేశించేనా.?Anupama post about bumrah marriage video

ఆ సెక్స్ డాల్‌ను పెళ్లి చేసుకొని ఇప్పుడు నచ్చలేదని విడాకులు ఇచ్చేశాడు : divorced to sex doll Video.