Joe Biden Inauguration Day 2021: అమెరికాలో ప్రారంభమైన కొత్త చరిత్ర.. జో బైడెన్‌ శకం మొదలైంది..

|

Jan 21, 2021 | 1:21 AM

ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్​ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా.. కమల చేత ప్రమాణస్వీకారం చేయించారు.

Joe Biden Inauguration Day 2021: అమెరికాలో ప్రారంభమైన కొత్త చరిత్ర.. జో బైడెన్‌ శకం మొదలైంది..
Follow us on

Joe Biden Sworn : అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైంది. ట్రంప్‌ శకం ముగిసింది. జో బైడెన్‌ శకం మొదలైంది. అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్… జో బైడెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తన కుటుంబానికి చెందిన 127ఏళ్ల బైబిల్​పై ప్రమాణం చేశారు. ఆ సమయంలో బైబిల్​ను బైడెన్  భార్య జిల్​ బైడెన్​ పట్టుకున్నారు.

కరోనా నిబంధనల కారణంగా కేవలం వెయ్యిమంది మాత్రమే ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా , బిల్‌ క్లింటన్‌ , జార్జ్‌బుష్‌ హాజరయ్యారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సీ పెలోసీతో పాటు పలువురు చట్టసభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని క్యాపిటల్‌ హిల్‌ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రమాణ స్వీకారంకు వచ్చే ముందు..

క్యాపిటల్​కు వచ్చే ముందు.. కుంటుంబసభ్యులు సమేతంగా వాషింగ్టన్​లోని చారిత్రక చర్చిని బైడెన్​ సందర్శించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అమెరికా చరిత్రలో తొలి మహిళా వైస్‌ ప్రెసిడెంట్‌గా కమలా హ్యారిస్‌ రికార్డు సృష్టించారు. భారతీయ మూలాలు ఉన్న కమలా అమెరికా ఉపాధ్యక్షురాలు కావడం దేశమంతా గర్విస్తోంది. తమిళనాడు లోని ఆమె పూర్వీకుల స్వస్థలంలో సంబరాలు మిన్నంటాయి.

ఇవి కూడా చదవండి : 

Joe Biden Inauguration Day Live Updates : అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడన్​ ప్రమాణం..