జో బిడెన్ పోటీకి రూట్ క్లియర్… “ట్రంప్ వర్సెస్ బిడెన్”

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇక రసవత్తరంగా మారనున్నాయి. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జో బిడెన్ అధికారికంగా ఖరారయ్యారు. న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డోనాల్డ్ ట్రంప్‌పై బిడెన్ పోటీ చేయ‌నున్నారు. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు మద్దతు బిడెన్‌కు లభించింది.

జో బిడెన్ పోటీకి రూట్ క్లియర్... ట్రంప్ వర్సెస్ బిడెన్
Follow us

|

Updated on: Jun 06, 2020 | 3:27 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇక రసవత్తరంగా మారనున్నాయి. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జో బిడెన్ అధికారికంగా ఖరారయ్యారు. న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డోనాల్డ్ ట్రంప్‌పై బిడెన్ పోటీ చేయ‌నున్నారు. అధ్యక్ష పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధులు మద్దతు బిడెన్‌కు లభించింది. అలాగే, అదే పార్టీకి చెందిన బెర్ని శాండర్స్ సైతం ఏప్రిల్‌లో పోటీ నుంచి తప్పుకోవడంతో బిడెన్‌కు రూట్ క్లియర్ అయ్యింది. దీంతో డెమొక్రట్ అభ్యర్థిగా ట్రంప్‌తో మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్ తలపడనున్నారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాలు, మూడు అమెరికా ప్రాదేశిక ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు బిడెన్‌కు మద్దతుగా నిలిచారు.

ప్రతినిధులు తనకు మద్దతు ఇవ్వడం పట్ల జో బిడెన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు లభించిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. “దేశం యొక్క ఆత్మ కోసం యుద్ధంలో గెలవండి” అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దక్షిణ కెరొలినాలో తాను నిర్వహించిన ప్రచారాన్ని బిడెన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఇక, 14 కాంటెస్ట్‌ల‌లో ఆయ‌న ప‌ది గెలుచుకున్నారు. 77 ఏళ్ల బిడెన్ 36 ఏళ్ల నుంచి సెనేటర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు అమెరికా అధ్య‌క్ష స్థానానికి పోటీ ప‌డ్డారు.

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..