America: అమెరికాలో అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

|

May 24, 2021 | 7:50 AM

America: అమెరికాలో తరచూ కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అమెరికాలోని ఒహాయా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో కాల్పుల ఘటన కలకలం రేపుతున్నాయి.ఒహాయాలోని..

America: అమెరికాలో అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Follow us on

America: అమెరికాలో తరచూ కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అమెరికాలోని ఒహాయా, న్యూజెర్సీ రాష్ట్రాల్లో కాల్పుల ఘటన కలకలం రేపుతున్నాయి. ఒహాయాలోని యాంగ్‌స్టౌన్‌లో టార్చ్‌ క్లబ్‌ బార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బార్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో గుర్తు తెలియని దుండగులు ఈ కాల్పులకు తెగబడినట్లు పలువురు తెలిపారు. మరోవైపు, శనివారం అర్ధరాత్రి దాటాక న్యూజెర్సీలోని సౌత్‌జెర్సీలో ఓ పార్టీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు మృతి చెందగా, 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో ఇలా వరుసగా కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో భారత్‌కు చెందిన వ్యక్తులు మృతి చెందిన సందర్భాలున్నాయి. వరుసగా కాల్పులు చోటు చేసుకుంటుండటంతో భయాందోళనకు గురవుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు, రెండో డోసు మధ్య గ్యాప్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది: అమెరికా

విషాదం.. మారథాన్‌ నిర్వహిస్తుండగా వడగండ్ల వర్షం.. 21 మంది మృతి.. పలువురికి గాయాలు.. కొందరి పరిస్థితి విషమం