Us Cold Snap: మంచు తుపానుతో అమెరికా, మెక్సికో విలవిల, టెక్సాస్ లో 40 లక్షల మంది ఇళ్లల్లో పవర్ కట్

అమెరికా మంచుతుపానులో 'చిక్కుకుపోయింది'. ముఖ్యంగా టెక్సాస్ లోను, సమీపంలోని మెక్సికో లోను ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి...

Us  Cold Snap: మంచు తుపానుతో అమెరికా, మెక్సికో విలవిల, టెక్సాస్ లో 40 లక్షల మంది ఇళ్లల్లో పవర్ కట్

Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 16, 2021 | 11:45 AM

Us Cold Snap: అమెరికా మంచుతుపానులో ‘చిక్కుకుపోయింది’. ముఖ్యంగా టెక్సాస్ లోను, సమీపంలోని మెక్సికో లోను ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. విద్యుత్ గ్రిడ్లు ఫెయిలయ్యాయి. పవర్ ను పునరుధ్ధరించేందుకు అధికారులు నానా పాట్లు పడ్డారు. అమెరికాలోని అతిపెద్ద క్రూడాయిల్ రిఫైనరీలు, హూస్టన్ లోని జార్జి బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. టెక్సాస్ లో సుమారు 40 లక్షలు, మెక్సికోలో కూడా సుమారు ఇంతేమంది రెండు రోజులుగా విద్యుత్ కటకటను ఎదుర్కొన్నారు. టెక్సాస్ లో చివరకు 2.5 మిలియన్ల మందికి మాత్రం విద్యుత్ సౌకర్యాన్ని పునరుధ్ధరించగలిగారు. అధ్యక్షుడు జోబైడెన్ టెక్సాస్ లో ఎమర్జెన్సీని ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా ఈ సౌకర్యాన్ని పునరుధ్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 2 నుంచి మైనస్ 22  సెల్సియస్ కు పడిపోయాయి. దీని ప్రభావం లూసియానా, ఓక్లహామా, మిస్సోరీ, న్యూయార్క్ సిటీ, న్యూజెర్సీ రాష్ట్రాల్లోనూ కనిపించింది. సోమవారం రాత్రి వరకు లక్షా 10 వేల ఇళ్ళు, కార్యాలయాలకు పవర్ సౌకర్యం లేకపోయింది. ప్రజలు వీధుల్లోకి రాకుండా తాత్కాలిక కర్ఫ్యూ విధించారు. విద్యుత్ గ్రిడ్లుఇంతగా  పని చేయకపోవడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. బుధవారం కూడా మంచు తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read:

Lemon Water Benefits: నిమ్మ‌ర‌సంతో కమ్మనైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందాం పదండి..

షాకింగ్, ఆస్ట్రేలియా పార్లమెంటులో మహిళ రేప్, బాధితురాలికి క్షమాపణ చెప్పిన ప్రధాని మారిసన్