అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ విలియం బర్న్స్ నిన్న కాబూల్ లో తాలిబన్ కో-ఫౌండర్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ తో రహస్యంగా సమావేశమయ్యారు. తాలిబన్లు ఆఫ్ఘన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం ఇస్లామిక్ గ్రూప్ నేతకు, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వంలోని ఓ ముఖ్యునికి మధ్య జరిగిన ఈ మీటింగ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆఫ్ఘన్ నుంచి ఇంకా వేలమంది ఆఫ్ఘన్లను, అమెరికన్లను తరలించవలసి ఉంది. బహుశా దీనిపై వారు చర్చించారా అన్నది తేలలేదు. ఈ సమావేశం గురించి సీఐఏ అధికార ప్రతినిధి ఎలాంటి వివరాలు చెప్పకపోగా.. తమ డైరెక్టర్ చేసే ప్రయాణాల గురించి తాము చర్చించబోమన్నారు. వాషింగ్టన్ పోస్ట్ కూడా ఈ సమావేశ వివరాలపై స్పందించలేదు. ఆగస్టు 31 డెడ్ లైన్ దగ్గర పడుతుండడంతో అమెరికా, బ్రిటన్ బలగాలను ఆఫ్ఘన్ లో పొడగిస్తారా లేక తరలింపు ప్రక్రియను నిలిపివేస్తారా అన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదని ఈ పత్రిక పేర్కొంది.
అయితే బలగాల పొడిగింపును తాము ఎంతమాత్రం అనుమతించబోమని, అదే జరిగితే అమెరికా, బ్రిటన్ దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై విలియం బర్న్స్, బరాదర్ ఇద్దరూ ప్రధానంగా ఫోకస్ పెట్టి కూడా చర్చించినట్టు భావిస్తున్నారు. అయినా జోబైడెన్ ఇంత రహస్యంగా తమ సీఐఏ డైరెక్టర్ ని తాలిబన్ల నేతతో సమావేశానికి పంపడం మాత్రం విశ్లేషకులకు మింగుడు పడడం లేదు. బహుశా ఈ డెడ్ లైన్ విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోలేక ఆయన తన ప్రతినిధిగా ఈ డైరెక్టర్ ని పంపినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు వారి అబ్బాయి..:Manchu Manoj Video.
హౌస్ అరెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్..: House Arrest Pre-Release Event Live Video.
Ek Number News Live Video: ధూంధాంగా దేవునికోడె అంత్యక్రియలు | ప్రేమజంటకు లగ్గం చేసిన సంఘపోళ్లు..