చైనా వల్లే కరోనా కష్టాలు : ట్రంప్

|

Jul 06, 2020 | 11:44 PM

చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ పాపం మొదటి నుంచి డ్రాగన్ దే అంటూ వాదిస్తున్న ట్రంప్ మరోసారి ఘాటుగానే టీట్టర్ వేదికగా కామెంట్ చేశారు.

చైనా వల్లే కరోనా కష్టాలు : ట్రంప్
Follow us on

చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ పాపం మొదటి నుంచి డ్రాగన్ దే అంటూ వాదిస్తున్న ట్రంప్ మరోసారి ఘాటుగానే కామెంట్ చేశారు.

చైనా కారణంగా అమెరికా ఒక్కటేకాదు ప్రపంచం మొత్తం చాలా కష్టాలు భరించాల్సి వచ్చిందని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ వేదికగా ఆరోపించారు. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ కారకులు చైనానే అని స్పష్టం చేశారు. చైనా అవలంబించే రహస్య, మోసపూరిత, నాటకీయ విధానాల కారణంగానే కరోనా విజృంభించిందని విమర్శించారు. ఈ కరోనా విలయ తాండవానికి చైనానే పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు చైనా, అమెరికాల మధ్య మరింత అజ్యం పోసినట్లైంది. అయితే, గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా ట్రంప్ తప్పుబట్టారు. కరోనా విషయంలో చైనాకు మద్దతుగా డబ్ల్యూహెచ్ఓ వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు.

China has caused great damage to the United States and the rest of the World!

— Donald J. Trump (@realDonaldTrump) July 6, 2020