Biden Tour – Kim Alert: బైడెన్ టూర్.. భయపెడుతున్న కిమ్.. ఏం జరుగుతుందోనని టెన్షన్ టెన్షన్..!

Biden Tour - Kim Alert: ఆసియా పర్యటనకు సిద్ధమైన అమెరికా అధ్యక్షునికి నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు టెన్షన్‌ పుట్టించాయి. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలే ఇందుకు కారణం.

Biden Tour - Kim Alert: బైడెన్ టూర్.. భయపెడుతున్న కిమ్.. ఏం జరుగుతుందోనని టెన్షన్ టెన్షన్..!
Joe Biden Vs Kim

Updated on: May 20, 2022 | 10:48 AM

Biden Tour – Kim Alert: ఆసియా పర్యటనకు సిద్ధమైన అమెరికా అధ్యక్షునికి నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు టెన్షన్‌ పుట్టించాయి. ఉత్తర కొరియా కవ్వింపు చర్యలే ఇందుకు కారణం. ఉక్రెయిన్‌-రష్యా వార్‌ కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసియా పర్యటన చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండో- పసిఫిక్‌ ప్రాంతం వ్యూహాత్మక ప్రయోజనాల్లో భాగంగా దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు వస్తున్నారు బైడెన్‌. ఈ సందర్భంగా ఆయన దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌తో భేటీకానున్నారు. అక్కడి క్వాడ్‌ సమావేశాల కోసం బైడెన్‌ జపాన్‌కు వెళ్లనున్నారు. ఈ భేటీలో ఆస్ట్రేలియా, భారత్‌ కూడా పాల్గొననున్నాయి.

బైడెన్‌ టూర్‌ ప్లాన్‌ అంతా సిద్ధమయ్యాక ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి వచ్చిన సమాచారం వైట్‌హౌస్‌ను ఆందోళనకు గురిచేశాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చాయి. అయితే ఈ పరీక్షలు అమెరికా అధ్యక్షుడు దక్షిణ కొరియా, జపాన్‌ పర్యటనలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత కానీ జరపవచ్చని తమకు పక్కా సమాచారం అందిందని తెలిపారు అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జాక్‌ సులేవాన్‌. ఉత్తర కొరియా ఎలాంటి కవ్వింపు చర్యలు చేపట్టినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారాయన.

ఇవి కూడా చదవండి

తమపై ఆంక్షలు ఎత్తేయడంతో పాటు, దక్షిణ కొరియాలో జోక్యాన్ని మానేయాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాడు. ఈ హామీ ఇస్తేనే తాము అణు పరీక్షలు నిలిపివేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే తరచూ క్షిపణి పరీక్షలు నిర్వహించడం కిమ్‌కు ఆనవాయితీగా మారింది.