4th Booster Shot: అగ్రరాజ్యాన్ని వెంటాడుతున్న కరోనా.. నాల్గో డోస్ ఇచ్చేందుకు సన్నాహాలు..

|

Feb 11, 2022 | 5:46 AM

Covid Vaccine 4th Dose in US: ఫస్ట్ డోస్.. రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన ఆగలేదు. ముచ్చటగా మూడోసారి బూస్టర్ డోస్ ఇచ్చినా కరోనా అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం

4th Booster Shot: అగ్రరాజ్యాన్ని వెంటాడుతున్న కరోనా.. నాల్గో డోస్ ఇచ్చేందుకు సన్నాహాలు..
Covid 19 Vaccine
Follow us on

Covid Vaccine 4th Dose in US: ఫస్ట్ డోస్.. రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన ఆగలేదు. ముచ్చటగా మూడోసారి బూస్టర్ డోస్ ఇచ్చినా కరోనా అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. నాల్గో డోస్ రూపంలో మరోసారి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు రెడీ అయింది. మెరుగైన వైద్య చికిత్సలో అగ్రగామైన అమెరికా (America) ను సైతం.. కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. రకరకాల రూపాలు మార్చుకున్న కోవిడ్, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ (Covid-19) లు ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు తీవ్రంగా నష్టం మిగిల్చాయి. మహమ్మారి భారిన పడి యూఎస్ లో లక్ష మందికి పైగా ప్రజలు మృతిచెందారు. ఫస్ట్ డోస్.. రెండో డోస్ .. ముచ్చటగా మూడోసారి బూస్టర్ డోస్ కు కోవిడ్ అదుపులోకి రాలేదు. దీంతో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. నాల్గో డోస్ రూపంలో మరోసారి బూస్టర్ డోస్ (Covid Vaccine)ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, దేశాధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్‌పై పోరాటంలో అమెరికా పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని చెప్పారు ఫౌచీ.

ప్రజ‌ల వ్యక్తిగ‌త వ‌య‌స్సు, ఆరోగ్యస‌మ‌స్యల ఆధారంగా నాలుగో డోసు వేయాల్సి ఉంటుందని డాక్టర్ ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు దేశంలో నాలుగో డోసు అవసరం ఉందంటూ ఫౌచీ సమాధానం ఇచ్చారు. నవంబర్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందడాన్ని ఒమిక్రాన్ దశగా అభివర్ణించారు ఫౌచీ. ఇదిలా ఉండగా.. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అమెరికాలోని న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌ తోపాటు మరికొన్ని రాష్ట్రాలు.. మాస్క్ తప్పనిసరి ఆదేశాల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, పాఠశాలల్లో మాస్క్ వినియోగాన్ని కొనసాగించాలన్న సీడీసీ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది అమెరికా ప్రభుత్వం. వైరస్‌ ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనూ పౌరులు మాస్క్ ధరించాలని సీడీసీ సూచించింది.ఇక కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 5లక్షల మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Also Read:

Covid 19 Deaths: ఆ 88 దేశాల్లో కరోనాతో ఎంత మంది భారతీయులు మృతి చెందారో తెలుసా? అంతులేని విషాదం..

Corona Virus: కరోనా నిబంధనలకు, వ్యాక్సిన్ కి వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ నిరసనలు..భారతీయులకు పలు సూచనలు చేసిన హైకమీషన్