Gun Fire: అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‎లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థులు మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు..

|

Dec 01, 2021 | 6:33 AM

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. డెట్రాయిట్‌లోని సబర్బన్‌లోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో మంగళవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు...

Gun Fire: అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‎లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థులు మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు..
Gund Fire
Follow us on

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. డెట్రాయిట్‌లోని సబర్బన్‌లోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో మంగళవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 15 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని ఓక్లాండ్ కౌంటీ అండర్‌షరీఫ్ మైఖేల్ మెక్‌కేబ్ ఒక తెలిపారు. అతని చేతిలో తుపాకీ కూడా దొరికిందన్నారు. మృతి చెందిన ముగ్గురినీ విద్యార్థులుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కానీ వారు ఎవరో గర్తించలేదన్నారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నట్లు తెలిపారు. ఒక ఉపాధ్యాయుడితో సహా ఎనిమిది మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని వివరించారు. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరికి శస్త్రచికిత్స జరగగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరో ఆరుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు ముందు పాఠశాలలో కాల్పులు జరుగుతున్నట్లు అధికారులకు 911 కాల్ వచ్చిందని మెక్‌కేబ్ చెప్పారు.

“నిందితుడిని అదుపులోకి తీసుకునే ముందు 15 నుంచి 20 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఐదు నిమిషాల్లోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు” అని మెక్‌కేబ్ చెప్పారు. ఆక్స్‌ఫర్డ్ ఉన్నత పాఠశాల డెట్రాయిట్‌కు ఉత్తరాన 45 మైళ్ల దూరంలో ఉంది. మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ మరణాలపై విచారం వ్యక్తం చేశారు. “మన పిల్లలు పాఠశాలలో సురక్షితంగా ఉండేందుకు” సమాజం కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ” వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి మాట్లాడుతూ, అధ్యక్షుడు జో బిడెన్‌కు కాల్పుల గురించి తెలియజేసినట్లు చెప్పారు. “ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన దుఃఖాన్ని భరిస్తున్న కుటుంబాలకు బిడెన్ సానుభూతి తెలిపారు.

Read Also.. India Covid Vaccines: ఒమిక్రాన్ బాధిత దేశాలకు వ్యాక్సిన్ సరఫరా.. అత్యవసర మందులను అందించడానికి భారత్ రెడీ..