Viral Video: మనుషులేనా..? మేము స్లిమ్‌గా ఉండాలి..! ఎత్తు, బ‌రువు కొలుచుకుంటున్న జంతువులు.. ఎక్క‌డంటే?

|

Aug 29, 2022 | 7:19 PM

ప్రతి ఒక్కరూ ఎత్తుకు త‌గ్గ బ‌రువుండాలని వైద్యులు చెబుతుంటారు.. అప్పుడే ఆ మనిషి సరైన ఆరోగ్యవంతులుగా ప‌రిగ‌ణిస్తారు. అయితే, ఇది మ‌నుషుల‌కే కాదు.. జంతువుల‌కూ వ‌ర్తిస్తుంది. అందుకే

Viral Video: మనుషులేనా..? మేము స్లిమ్‌గా ఉండాలి..! ఎత్తు, బ‌రువు కొలుచుకుంటున్న జంతువులు.. ఎక్క‌డంటే?
London Zoo
Follow us on

Viral Video: ప్రతి ఒక్కరూ ఎత్తుకు త‌గ్గ బ‌రువుండాలని వైద్యులు చెబుతుంటారు.. అప్పుడే ఆ మనిషి సరైన ఆరోగ్యవంతులుగా ప‌రిగ‌ణిస్తారు. అయితే, ఇది మ‌నుషుల‌కే కాదు.. జంతువుల‌కూ వ‌ర్తిస్తుంది. అందుకే బ్రిట‌న్‌లోని జ‌డ్ఎస్ఎల్ లండ‌న్ జంతుప్ర‌ద‌ర్శ‌న‌శాల ఈ ఆగస్టు 25న జంతువుల బ‌రువు, ఎత్తును కొలిచే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. అక్కడి జంతువుల బరువు, పొడుగును ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వాటి ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటిస్తోంది. వారం రోజుల పాటు సాగే ఈ ప్రక్రియకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది.

ఈ ప్రత్యేక జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక పద్ధతులనే అనుసరిస్తోంది జడ్‌ఎస్‌ఎల్‌ లండన్‌ జూపార్కు నిర్వహణా విభాగం. వాటి బరువు, ఎత్తును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటి ఆరోగ్యంలో తేడా రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఈ వీడియోలో సుమత్రన్ పులి గయ్షా త‌న ఎత్తును కొలుచుకోవ‌డం క‌నిపిస్తుంది. ఇది అంతరించిపోతున్న మూడు పులి పిల్లలకు ఇటీవ‌లే జన్మనిచ్చింది. పెంగ్విన్‌లు ఒడ్డుకు రాగా, జూ కీప‌ర్ వాటికి ఆహారం అందిస్తూ బ‌రువు కొలుస్తున్నాడు. సీజనల్ అక్వేరియం కీపర్ కొలెట్ గిబ్బింగ్స్ టైనీ జెయింట్స్ అక్వేరియంలోకి వెళ్లి బ్రెయిన్ కోర‌ల్స్ బ‌రువును కొలిచాడు. బొలీవియన్ బ్లాక్-క్యాప్డ్ స్క్విరెల్ కోతుల దళం ఆహారం కోసం వ‌చ్చి వాటిని బ‌రువును తూచుకున్నాయి. ఒంటెను నెమ్మ‌దిగా వెయింగ్ మిష‌న్‌పై ఎక్కించి, బ‌రువు కొలిచారు.

ఇవి కూడా చదవండి

ఇలా జూలోని దాదాపు 15,000 జంతువుల బ‌రువు, ఎత్తును వారంలో కొలుస్తామ‌ని జూలోని డిప్యూటీ ఆపరేషన్స్ మేనేజర్ డేనియల్ సిమండ్స్ తెలిపాడు. ఈ జంతువుల ఎత్తు, బ‌రువును రికార్డు చేసి పెడ‌తామ‌ని చెప్పాడు. ఏదైనా జంతువు స‌డెన్ బ‌రువు త‌గ్గితే తెలుసుకుని, ప‌శువైద్యుడికి తెలియ‌జేసేందుకు ఈ డేటా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి