Dangerous Food: డేంజరస్‌ రెసిపీ.. పాములు, తేళ్లతో స్పెషల్ సూప్..! ఎంజాయ్ చేస్తున్న భోజనప్రియులు..

|

Jan 12, 2023 | 3:22 PM

ఇందుకోసం దాదాపు 3 గంటల పాటు పాములు, తేళ్లను ఉడికిస్తారు.. దీని తరువాత పంది మాంసం, పాము, అల్లం, వెల్లుల్లి, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో ఒక వంటగిన్నెలో కలిసి కుక్‌ చేస్తారు. దీనికి కొన్ని కూరగాయలు కూడా కలుపుతారు.

Dangerous Food: డేంజరస్‌ రెసిపీ.. పాములు, తేళ్లతో స్పెషల్ సూప్..! ఎంజాయ్ చేస్తున్న భోజనప్రియులు..
Scorpion Snake Soup
Follow us on

మీరు చాలా విచిత్రమైన అన్యదేశ వంటకాల గురించి వినే ఉంటారు. అయితే ఈరోజు మేము మీకు ఒక భయంకరమైన వంటకం గురించి తెలియజేస్తున్నాము. ఇదేంటో తెలిస్తే మాత్రం మీ ఒళ్లు గగ్గుర్పాటుకు గురికావాల్సిందే.. ఇక వేసవి రాకతో చైనాలో మాత్రం ఈ వంటకానికి ఫుల్‌ డిమాండ్ పెరుగుతుంది. ఇకపోతే, ఈ వంటకం చేయడానికి విషపూరితమైన పాములు, తేళ్లను ఉపయోగిస్తారని తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కళ్లు తిరిగి పడిపోతారు. అందిన సమాచారం ప్రకారం..ఈ భయానక వంటకాన్ని చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో తయారు చేసి విక్రయిస్తున్నారు. అత్యంత విషపూరితమైన జీవులలో పాములు,తేళ్లు ఈ రెండింటీని ఈ వంటకంలో ఉపయోగిస్తారు. పాములు,తేళ్ల మిశ్రమంతో తయారు చేయబడిన ఈ సూప్ దక్షిణ చైనాలో కనిపిస్తుంది. దానికి పంది మాంసం కూడా కలుపుతారు. అదనంగా దీనికి ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు కూడా కలుపుతారు.

ఈ ప్రత్యేకమైన సూప్ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుందని చైనీయుల నమ్మకం. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకర అంశం ఏంటంటే.. ఈ సూప్ అక్కడి వంటకాలు, సంస్కృతిలో ఒక భాగమని చెబుతున్నారు. కానీ అక్కడ ఉన్న అన్ని రెస్టారెంట్లలో ఈ వంటకం అందుబాటులో ఉండదు. ఈ వంటకం కొన్ని ప్రత్యేక రెస్టారెంట్లలో మాత్రమే దొరుకుతుంది. ఇది అనుభవజ్ఞులైన చెఫ్‌లచే మాత్రమే తయారు చేయబడుతుంది. తేళ్లు, పాములను ఉపయోగించే ముందు వాటి నుండి విషాన్ని ఎలా తొలగించాలో ఈ కుక్‌లకు మాత్రమే తెలుస్తుందట.

ఈ సూప్ ఎలా తయారు చేస్తారు?
ఈ వంటకాన్ని తయారుచేసే ముందు పాము, తేలు విషాన్ని సంగ్రహిస్తారు. ఇందుకోసం దాదాపు 3 గంటల పాటు పాములు, తేళ్లను ఉడికిస్తారు.. దీని తరువాత పంది మాంసం, పాము, అల్లం, వెల్లుల్లి, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలతో ఒక వంటగిన్నెలో కలిసి కుక్‌ చేస్తారు. దీనికి కొన్ని కూరగాయలు కూడా కలుపుతారు. దీని తరువాత, తేలు రసం దానిలో కలుపుతారు. చైనీయులు దీని రుచిని చాలా ఇష్టపడతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..