World Wide Corona Update: ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం… తాజాగా 9 కోట్లు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

చైనా హుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను చుట్టేసింది. ఏడాది గడుస్తున్నా.. రోజూ దేశ విదేశాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ భయాందోళలకు..

World Wide Corona Update: ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం... తాజాగా 9 కోట్లు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

Updated on: Jan 10, 2021 | 3:40 PM

World Wide Corona Update : చైనా హుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను చుట్టేసింది. ఏడాది గడుస్తున్నా.. రోజూ దేశ విదేశాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ భయాందోళలకు గురిచేస్తోంది. పెద్ద, చిన్న అనే తేడాలేకుండా ప్రతి దేశం కోవిడ్ ని అరికట్టడానికి వ్యాక్సిన్ తయారీలో బిజీ అయ్యాయి. ఓ వైపు కరోనా విలయం కొనసాగుతూనే ఉంది మరో వైపు యూకే, దక్షిణాఫ్రికాలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఈ వైరస్ లు ఒకదానికంటే మరొకటి శక్తివంతమైనవని శాస్త్రజ్ఞులు ప్రకటించారు.

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 9 కోట్లు దాటగా, 19 లక్షల మందికి పైగా మరణించారు. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 9,01,38,063 లకు చేరుకుంది. ఇక మొత్తం మరణాల సంఖ్య
19,35,955 లకు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 6,45,37,925మంది కోలుకున్నారు.. 2,36,64,183 యాక్టివ్ కేసులున్నాయి.
మరణాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండడంతో.. బ్రిటన్, జర్మనీ సహా పలు దేశాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. జపాన్ రాజధాని టోక్యోలో అత్యవసర పరిస్థితిని విధించింది అక్కడి ప్రభుత్వం అగ్రదేశం అమెరికా పై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించింది. అత్యధిక కేసులు2 ,26, 99,938 మరణాలు 3,81,480 ఆ దేశంలోనే సంభవించాయి. కేసుల పరంగా చూసుకుంటే భారత్ రెండో స్థానంలో ఉంది.

Also Read: అర్ధరాత్రి వేళ భారత్ భూభాగంలోకి చైనా ఆర్మీ జవాన్ … పొరపాటున వచ్చాడు విడుదల చేయమని కోరుతున్న పీఎల్ కే