World Car Free Day: కార్ ఫ్రీ డే అంటే తెలుసా.. మొత్తం కథ తెలిస్తే అవాక్కావ్వాల్సిందే..

కార్-ఫ్రీ డేస్ 2000లో కార్బస్టర్స్ ప్రారంభించిన వరల్డ్ కార్ ఫ్రీ డే ప్రోగ్రామ్‌తో ప్రపంచ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పుడు వరల్డ్ కార్ ఫ్రీ నెట్‌వర్క్ గా మారిపోయింది. ఇప్పుడు ఇక..

World Car Free Day: కార్ ఫ్రీ డే అంటే తెలుసా.. మొత్తం కథ తెలిస్తే అవాక్కావ్వాల్సిందే..
World Car Free Day

Updated on: Sep 22, 2022 | 4:58 PM

World Car Free Day: సెప్టెంబర్ 22ని ప్రపంచ కార్ ఫ్రీ డేగా పాటిస్తున్నారు. కార్ ఫ్రీ డే అనేది సామూహిక రవాణా, సైక్లింగ్, నడకను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడంపై ఆధారపడి ఉంటుంది. నగరాల్లో చిన్న ప్రయాణాలకు కారును వాడటం కంటే.. సైకిల్‌ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా సుస్థిర భవిష్యత్తును, పర్యావరణాన్ని పరిరక్షించడానికి కూడా మనం దోహదపడవచ్చు. కాబట్టి ప్రపంచ కార్ ఫ్రీ డే సందర్భంగా.. ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకుందాం..

ప్రపంచ కార్ ఫ్రీ డే చరిత్ర:
1970లలో చమురు సంక్షోభం సమయంలో కార్ ఫ్రీ డేస్ నిర్వహించబడ్డాయి. 1990ల ప్రారంభంలో యూరోపియన్ నగరాల్లో అనేక కార్-ఫ్రీ డేస్ నిర్వహించబడ్డాయి. 1999లో ఐరోపాలో అంతర్జాతీయ కార్‌ఫ్రీ డే నిర్వహించబడింది. ఇది యూరోపియన్ యూనియన్ యొక్క ఇన్ టౌన్ వితౌట్ మై కార్ ప్రచారం పైలట్ ప్రాజెక్ట్. ఈ ప్రచారం యూరోపియన్ మొబిలిటీ వీక్‌గా కొనసాగుతుంది. కార్-ఫ్రీ డేస్ 2000లో కార్బస్టర్స్ ప్రారంభించిన వరల్డ్ కార్ ఫ్రీ డే ప్రోగ్రామ్‌తో ప్రపంచ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పుడు వరల్డ్ కార్ ఫ్రీ నెట్‌వర్క్ గా మారిపోయింది.

ప్రపంచ కార్ ఫ్రీ డే ప్రాముఖ్యత:
ప్రపంచ కార్ ఫ్రీ డే అనేది కార్లు లేకుండా మన నగరాలు ఎలా ఉంటుందో చూపించడానికి ఒక చొరవ. మన వ్యక్తిగత ప్రయాణాలు, మనం నివసించే పట్టణ వాతావరణాన్ని పునరాలోచించుకోవడానికి, వాటి అవశ్యతను తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. అలాగే ప్రపంచ కార్ ఫ్రీ డే అనేది కార్ల శబ్దం, ఒత్తిడి, కాలుష్యం లేకుండా నగరాల్లో ప్రజా జీవితాన్ని జరుపుకునే వేడుక. సామూహిక రవాణా వల్ల కలిగే ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని ప్రాముఖ్యతను కూడా ఈ రోజును తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి