Sri Lanka Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకకు ప్రపంచ బ్యాంక్ అండగా నిలిచింది. ఇతర దేశాల నుంచి ఔషధాలను కూడా దిగుమతి చేసుకోలేని స్థితిలో ఉన్న దేశానికి, అత్యవసర ఔషధాలను కొనుగోలు చేసేందుకు తక్షణమే 10 మిలియన్ అమెరికా డాలర్లను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీ తెలిపారు. ప్రపంచ బ్యాంకు అధికారులతో జరిగిన చర్చల అనంతరం ఆమోదం లభించిందని సోమవారం రాత్రి జరిగిన టెలివిజన్ కార్యక్రమంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఎమర్జెన్సీ మందులు, గ్యాస్‌తో సహా ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు ప్రపంచ బ్యాంకు మరో 500 మిలియన్ డాలర్లను రెండు వారాల్లోగా మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో… అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా కోసం ఒత్తిడి పెరుగుతోన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడి సెక్రటేరియట్ వద్ద నిరసనలు నిన్న కూడా కొనసాగాయి. నిరసనకారులు రాత్రంతా అక్కడే ఉండి ‘గో హోమ్ గొట’ అంటూ అధ్యక్షుడి రాజీనామా కోసం నినాదాలు చేశారు. తమకు కరెంట్, గ్యాస్, పెట్రోల్, మెడిసిన్ లేవు… అందుకే ఆందోళన చేస్తున్నామని ప్రజలు తెలిపారు. రాజపక్సే రాజీనామా చేయాల్సిందేనని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే శ్రీలంకలో నిరసన ప్రదర్శనల్లో విషాదం జరిగింది. శ్రీలంక హిప్/హాప్ రాప్ కళాకారుడు షిరాజ్ రుడెబ్వోయ్ నిరసనలో గుండె పోటుతో మృతి చెందారు. ఓల్డ్ మార్టమెంట్ ఎదుట జరిగిన నిరసనల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. నిరసనకారులని ఉత్సాహపర్చేందుకు ర్యాప్ సాంగ్స్ పాడుతుండగా షిరాజ్ అక్కడికడ్కే కూలిపోయారు. షిరాజ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక షిరాజ్ నిరసనకారులను ఉత్సాహపరుస్తూ పాటలు పడుతుండగా చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Beauty Tips: ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోయారా.. పెరుగుతో ఇలా ఉపశమనం పొందండి..!
Yadadri: ఇవాళ యాదాద్రికి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి..