డ్రాగన్ కంట్రీ పక్క దేశాలను ఆక్రమించుకునే పనిలో ఉంటే.. ఆ దేశంలో రోజు రోజుకు జననాల రేటు పడిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. యువత కనిపించకుండా పోతున్నారు. యువత తగ్గి పోవడంతో శ్రామిక శక్తి నిర్వీర్యం అవుతోంది. దీంతో చైనా జి జిన్‌పింగ్ ప్రభుత్వం మంగళవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో స్థానిక భత్యాలను ఆదేశించింది. దేశంలో జనన రేటు రికార్డు స్థాయికి పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2025 నాటికి దేశ జనాభా వేగంగా క్షీణించడం ప్రారంభిస్తుందని అక్కడి అధికారులు తాజాగా హెచ్చరించారు. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశం.. ఇప్పుడు అతి పెద్ద సంక్షోభంతో పోరాడుతోంది. ఎందుకంటే అక్కడ రిటైర్మెంట్ అవుతున్న కార్మికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. యువ శ్రామికశక్తి లేకుండా పోతోంది.
2016లో రిజిడ్ పాలసీని కూడా రద్దు చేశారు
బీజింగ్ 2016లో తన కఠినమైన “ఒక బిడ్డ విధానాన్ని” ముగించింది. గత సంవత్సరం జంటలకు ముగ్గురు పిల్లలను కనేందకు అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న ఇంటికి ఒకరు అనే నినాదాన్ని ఎత్తిపడేశారు. అయినా అక్కడి జనాభా రేటు పెరగడం లేదు. గత ఐదేళ్లలో దేశంలో జననాల రేటు బాగా తగ్గింది. జాతీయ ఆరోగ్య కమిషన్ మంగళవారం జారీ చేసిన పాలసీ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా పునరుత్పత్తి దారుణంగా పడిపోయిందని వెల్లడించింది. ఆరోగ్యంపై ఖర్చును పెంచాలని.. దేశవ్యాప్తంగా పిల్లల సంరక్షణ సేవలను మెరుగుపరచాలని కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలను కోరింది.
రాయితీలు, పన్ను మినహాయింపులు, మెరుగైన ఆరోగ్య బీమా, అలాగే యువ కుటుంబాలకు విద్య, గృహాలు, ఉపాధి మద్దతుతో సహా “ప్రోయాక్టివ్ ఫెర్టిలిటీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కమిషన్ స్థానిక ప్రభుత్వాలకు కోరింది.
ఎక్కువ మంది పిల్లలను కనండి
సంపన్న చైనీస్ నగరాలు మహిళలకు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా ప్రోత్సహించడానికి పన్ను, హౌసింగ్ క్రెడిట్లు, విద్యా ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. తాజా మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రావిన్స్‌లు అటువంటి చర్యలను అమలు చేయాలని కోరుతున్నాయి.
నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం, చైనా జననాల రేటు గత సంవత్సరం 1,000 మందికి 7.52 జననాలకు పడిపోయింది. ఇది 1949 నుంచి ఇదే దారుణ రికార్డు. దీని ప్రకారం, కమ్యూనిస్ట్ చైనా స్థాపన తర్వాత, ఇది అత్యల్ప జనాభా రికార్డు. చైనాలో, పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. ఆ తర్వాత పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గడం ప్రారంభమైంది. చైనాలో సాంస్కృతిక మార్పు తరువాత, ప్రజలు చిన్న కుటుంబాలకు అలవాటు పడ్డారు. దీని కారణంగా పిల్లల సంఖ్య తగ్గింది. 2025 నాటికి చైనా జనాభా తగ్గుముఖం పడుతుందని ఆరోగ్య అధికారులు ఈ నెల ప్రారంభంలో హెచ్చరించారు. దీని తర్వాత ప్రభుత్వ స్పృహ తప్పింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..